ఆయకట్టు : 122. లక్షల ఎకరాలు , సోర్స్ : శ్రీశైలం జలాశయం, లబ్ది పొందే జిల్లాలు : నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ. ప్రతిరోజు లిఫ్ట్ చేసే జలాలు : 1. టీఎంసీ. లిఫ్ట్ స్టజీలు : 5, రిజర్వాయర్లు : 6. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం : 67 టీఎంసీలు. పంపుల గరిష్ట సామర్థ్యం : 145 మెగావాట్లు. నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు : 672 మీటర్లు. సొరంగ మార్గం పొడవు : 61.57 కిలోమీటర్లు, ప్రధాన కాలువల పొడవు : 915.47 కిలోమీటర్లు, తాగునీటికి వినియోగం : 7.15 టీఎంసీలు, పరిశ్రమల వినియోగానికి కేటాయింపులు : 3 టీఎంసీలు, సాగునీటి కోసం కేటాయింపులు :79.00 టీఎంసీలు, ఏదుల పంప్ హౌజ్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్, అత్యధిక సామర్ధ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు 145 మెగావాట్ల సామర్థ్యం మహా బాహుబలి మోటార్ల వినియోగం, మూడు పంప్ హౌజ్ లలో 145 మెగా వాట్ల భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇదే ప్రథమం. ఈ మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ ఈఎల్ తయారు చేయడం విశేషం.




