అప్పుచేసి పప్పుకూడా అన్న సామెత పాతది. ఇప్పుడేమో అప్పుచేసి పప్పు బెల్లాలుగా పంచిపెట్టు అంటే బాగుంటుందేమో…ఎందుకంటే రాష్టాల్రతో పాటు కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి ప్రజలకు కష్టాలు తెస్తున్నాయి. ఎవరికి వారు మాకు ప్రజల మద్దతు ఉందని, వారు ఓట్లేసారని చెబుతూ ఇష్టం వచ్చి నట్లుగా పాలన చేస్తున్నారు. పాలన అంటే విచ్చలవిడితనం కాదు. పాలన అంటే అప్పులు చేయడం కాదు. పాలన అంటే ప్రజలు హింసించడం కాదు. పాలన అంటే సొంతంగా డబ్బులు వెనకేసుకుని విలాసాలు కులకడం కాదు. ప్రత్యేక విమానాలు వేసుకుని విహారాలు తిరగడం కాదు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల ధనాన్ని వృధా చేయడం కాదు. తమ ఇంట్లో నుంచి సంపాదించినట్లుగా పథకాలు,సంక్షేమం పేరుతో పందేరం చేయడం కాదు.
ధర్మకర్తగా ఉంటూ ప్రజల డబ్బుతో అభివృద్ది పనులు చేయాల్సిన పాలకులు లక్షలకోట్లు అప్పులు చేస్తున్నారు. పైగా ఫలానా అయన సమయంలోనే ఎక్కువ అప్పులు చేశారని అంటున్నారు. తెలుగు రాష్టాల్ల్రో ఈ వ్యవహారం అతిగా మారింది. ప్రజల కోసం అంటూ అప్పులు చేసి పప్పుబెల్లాలుగా పంచి పెడుతున్నారు. కేంద్రం కూడా ఇలాగే అప్పులు చేస్తూ పోతున్నది. ఈ క్రమంలో ప్రజల సమస్యలను పక్కకు పెట్టి, పంచుడు విధానం వచ్చి చేరింది. ఇలాంటి దానికి వీరికి అధికారం ఎందుకివ్వాలో ప్రజలు ఆలోచించాలి. ఉచిత పథకాలతో బొక్కసాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ పోతే భవిష్యత్ ఎలా అన్న ఆందోళన కలుగుతోంది. పాలకులు మాత్రం తామున్నంతలో సంపాదించు కోవడం, దోచిపెట్టడం అన్న చందంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్ఆయక్యలు కనువిప్పు కావాలి.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హావ్నిలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని కూడా ప్రశ్నించారు. హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఉచిత పథకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్టాల్ర స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్టాల్రు దివాలా తీస్తున్నా యని పిటిషనర్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్టాల్రకు కలిపి రూ.70 లక్షలకోట్లు అప్పు ఉందన్నారు. ఇలా చేస్తూ పోతున్న పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. నిజానికి ఇదో మంచి సూచన. దూకుడు వ్నిదున్న పాలకులకు కళ్లె వేయాలి. ఉచిత పథకాల పేరుతో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను ఇష్టం వచ్చినట్లుగా పందేరం చేయడం ఎంతమాత్రం సహేతుకం కాదు. అలాగే అప్పులు చేయడం కూడా అంతే నేరంగా పరిగణించాలి. ప్రజలను చేవలేనివాళ్లుగా చేస్తున్న తీరు సరికాదు. 2014 మార్చి 31 నాటికి దేశ అప్పులు రూ.55.87 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి అవి రూ.152.17 లక్షల కోట్లకు పెరగనున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. అంటే గత తొమ్మిదేండ్లలో కేంద్రం ఏకంగా రూ.96 లక్షల కోట్ల అప్పు చేసింది. 65 ఏండ్లలో దేశం చేసిన అప్పుల తో పోల్చితే మోదీ సర్కార్ కేవలం 9 సంవత్సరాల్లోనే రెట్టింపు అప్పులు చేసింది.
తద్వారా దేశంలోని ప్రతి పౌరుని తలసరి అప్పును రెట్టింపు కంటే ఎక్కువకు పెంచింది. 2014 నాటికి దేశ జనాభా దాదాపు 129 కోట్లు. ఈ లెక్కన అప్పుడు తలసరి అప్పు సుమారు రూ.4.34 లక్షలు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరినట్టు భావించినా.. ప్రతి పౌరునిపై రూ.11 లక్షల రుణభారం ఉన్నట్టే. కేంద్రంతో పాటు రాష్టాల్రు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. తెలంగాణ, ఎపిలు కూడా అప్పుల్లో మునిగి తేలుతున్నాయి. అప్పులు చేసి అభివృద్ది చేసి, ఆస్తులను సృష్టించడం లేదు. వరదలు వస్తే కనీసం ప్రజలను ఆదుకోవడానికి మాత్రం చేతులు రావు. కానీ పంచడానికి మాత్రం వెనకాడడం లేదు. రాష్టాల్ర అప్పులను కంట్రోల్ చేయాల్సిన కేంద్రం కూడా విపరీతంగా అప్పులు చేయడం క్షమించరాని నేరంగా చూడాలి. పేదలకు ఇచ్చే సబ్సిడీలకు క్రమంగా మంగళం పాడుతున్న మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు తెచ్చిన అప్పులతో ఎవరిని ఉద్ధరిస్తున్న దన్నదే ప్రశ్న. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను భారీగా పెంచి ఖజానాలో నింపుకొన్న రూ.లక్షల కోట్లను మోదీ సర్కార్ ఏం చేస్తున్నదో చెప్పాలి. ఇకపోతే అప్పులు చేయడమే కాదు ప్రభుత్వరంగసంస్థల ను నిస్సిగ్గుగా తెగనమ్మే స్తున్నారు. ఇకపోతే అప్పులపై ఎపి ప్రభుత్వ వాదన కూడా వింతగా ఉంది. టీడీపీ హయాంలోనే అనవసర అప్పులు చేశారని ఆంధప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిమితికి మించి ఏనాడూ అప్పులు చేయలేదని సమర్థించుకున్నారు. దేశంలో ఆంధప్రదేశ్ మాత్రమే ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, మనకంటే ఇతర రాష్టాల్రు ఇంకా ఎక్కువ రుణం తీసుకుంటున్నాయని గణాంకాలతో సహా వివరించారు. కాళేశ్వరంలో కోట్లు వృధా అయ్యాయని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కూడా ఉచిత పథకాలు, డబ్బుల పందేరాలు జూదాల్లా సాగుతున్నాయి. అయితే ఎవరెంత అప్పు చేశారో ఇటీవల కేంద్రం లోక్సభకు వివరించింది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే పాలకుల అసమర్థ విధానాలు ప్రస్ఫుటంగగా కనిపిస్తున్నాయి. దీనిపై చర్చ జరగాలి. పార్లమెంటులో పథకాలపై చర్చించాలి. ఉచిత పథకాలు, డబ్బుల పందేరాలపై నియంత్రణ విధించాలి. లేకుంటే అప్పులు మాత్రమే మిగులుతాయి. పాలకలు చేసే ఈ పనలుకు ప్రజల మద్దతు ఉందన్న ప్రచారం సరికాదు. ప్రజలు పాలనకు మాత్రమే వోట్లు వేశారిన పాలకులు గుర్తించాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల