ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 :పార్టీ నాయకుల,కార్యకర్తల భావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్ (మామ) సూచించారు.నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విషయం శనివారం ప్రజాతంత్ర దినపత్రికలో వచ్చిన’ఇష్టం వచ్చినట్లు నియామాకాలు చేపట్టవద్దు’అనే వార్తకు ఆయన స్పందిస్తూ,ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉంటే ఏమన్నా తప్పులు జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూర్చొని మాట్లాడుకోవాలని లేకుంటే డిసిసికి గాని గాంధీ భవన్లో గాని రాతపూర్వకంగా ఇచ్చుకోవాలని ఆయన తెలిపారు.ఈ విధంగా మీడియాకెక్కి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా పార్టీ పరువు తీయొద్దని మనసు పూర్తిగా అందర్నీ కోరుతున్నానని అన్నారు.గత 36 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదన్నారు.ఏమైన ఉంటే మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళమని నేడు కాంగ్రెస్ పార్టీని బజారుకి ఇడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది మంచిది కాదని హితవు పలికారు.రాహుల్ గాంధీ,టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు ఎంత క్లియర్ గా చెప్పిన మనము అర్థం చేసుకోకపోవడం వల్ల నష్టం మనకేనని, ఆలోచించుకొవాల్సిన సమయం ఆసన్నమైందని శేఖర్ గౌడ్ సూచించారు.ఇలాంటివి మీడియా ద్వారా ఆటకెక్కితే పార్టీని బజార్లో పెట్టిన వాళ్ళమవుతామని తెలిపారు.మన పరువు మనమే తీసుకున్న వాళ్ళం అవుతామన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.మనస్పర్దలు వీడి అందరం ఒక్కటై కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు



