ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ పుట్టిన రోజు కానుకగా చేవెళ్ల,మొయినాబాద్ కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు పాటల సీడి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.చేవెళ్ల గడ్డ మీద యుద్ధం పుట్టింది అనే పాటల సీడిని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ముందు పామేన భీం భరత్ ఘనంగా ఆవిష్కరించారు.”చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ గెలవాలి..చేవెళ్ల మురవాలి” అని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో…. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి ఆగిరెడ్డి,దేవర వెంకట్ రెడ్డి,పాడాల ప్రభాకర్,గోనె ప్రతాప్ రెడ్డి,మధుసూదన గుప్తా,మద్దెల శ్రీనివాస్,గన్నేపాగ నర్సింగ్ రావు,సహదేవ్,పూడూరు ప్రవీణ్ కుమార్ (టిల్లు),షాబాద్ సందీప్ కుమార్,కే.నవీన్,షాబాద్ ప్రవీణ్,పీ.శ్రీధర్ తదితరులున్నారు.
పామేన భీం భరత్ గెలవాలి చేవెళ్ల మురవాలి





