ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి ఆచారి కార్యక్రమంలో భాగంగా గురువారం కడ్తాల మండలంలోని నల్లకుంట తండా, కర్కల్ పహాడ్ గ్రామ పెద్దలు నాయకులతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ పథకాల గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా గ్రామ ప్రజలు రైతులు ఆచారి కి తమ గ్రామానికి దగ్గరలో గల సర్వే నంబర్ 6 ఉన్న మైనింగ్ తో వ్యవసాయ బోర్లకు పంటలకు గ్రామంలో ఉన్న ఇండ్లకు భారీగా బీటలుతో ఇబ్బందులకు గురవుతున్నామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు పాత్లావత్ మన్యా నాయక్, మాజీ ఎంపీపీ వీరయ్య, నాయకులు మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు భగీరథ, రెడ్యానాయక్ జిల్లా నాయకులు సాయి లాల్ నాయక్, రవీందర్ రెడ్డి, మండల నాయకులు మహేష్, శ్రీశైలం, గడ్డం వెంకటేష్, జంగం వెంకటేష్, రాందాస్ నాయక్, విజయ్, శేఖర్, నరేందర్, ప్రేమ్ కుమార్, గ్రామ నాయకులు హున్య నాయక్, కియా నాయక్, సుభాష్, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.



