హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 01 : భారత జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని బిజెపి రాష్ట్ర శాఖ కోశాధికారి షేక్ రేహమతుల్లా అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మోజం జాహి మార్కెట్ నుండి సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయం వరకు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విద్యార్థులు నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వనిత విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ శోభన దేశ్ పాండే, ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ జాయిన్ డైరెక్టర్ డాక్టర్ ఆక్తేర్ అలీలు షేక్ రేహమతుల్లాను శాలువా మెమొంటో పూలమాలతో సన్మానించి జాతీయ ఐక్యత అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు కాశమని శ్యామ్ రావు ముదిరాజ్, ఎన్సిసి ఆఫీసర్ మేజర్ ఎన్.సుప్రియ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్.స్వాతి, నాగలక్ష్మి, ఎ.సంధ్య పాల్గొని ప్రసంగించారు.
పటేల్ చూపిన బాటలో పయనించాలి



