పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు
బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్
బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్ వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 11 : కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తుందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. వారు ఆ చిచ్చులో చలి మంటలను కాచుకుని, నాలుగు వోట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. పంచాయితీలు పెట్టుకోవాలని ఏ దేవుడు కూడా చెప్పలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను, రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ..మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలన్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం 25 కోట్ల మంది ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారని, ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆర్థం చేసుకోవాలన్నారు. చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరో ఆలోచించాలని సూచించారు. కరెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలన్నారు. సవ్యమైన పద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. గతంలో మురికి కూపంగా ఉన్న లకారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. లకారం చెరువు వద్ద తీగల వంతెనను ఏర్పాటు చేయడం వల్ల రోజుకు 2 వేల మంది అక్కడికి వొచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదని గుర్తు చేశారు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేక అసూయతో కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 1987లో భారతదేశం ఆర్థిక పరిస్థితి, చైనా ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండేదన్నారు. కానీ 35 ఏండ్ల తర్వాత చూస్తే చైనా 16 ట్రిలియన్ డాలర్లతో ముందుకు దూసుకుపోతే. మనం మాత్రం 3 ట్రిలియన్ డాలర్లతో వెనుకబడిపోయామన్నారు. పేదల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్నతి, ఎదిగిన దేశాలతోనే మా పోటీ అని చైనా ప్రకటించి, అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చైనా ఎదిగిందన్నారు.
బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్ వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్
మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా భాజపాపై మరోసారి విరుచుకుపడ్డారు. కమలం నేతలంతా సత్య హరిశ్చంద్రులు, వారంతా ఆయన వారసులా అని ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో భాజపా నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ వేదికగా కేంద్ర సర్కార్ వైఫల్యాలను కెటిఆర్ నిలదీశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హావి•లపైనా ప్రశ్నించారు. 8 ఏళ్లలో మోదీ సర్కార్ ఇచ్చిన హావి•లు.. నెరవేర్చిన వాటి గురించి నిలదీశారు. 8 ఏళ్ల పాలనలో ఎంతమంది బిజెపి నేతలపై దాడి చేసి..ఎందరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాషాయ నేతలంతా సత్య హరిశ్చంద్రులు, ఆయన వారసుల్లా ఫీలవుతున్నారని ధ్వజమెత్తారు. జస్ట్ ఆస్కింగ్ అనే హాష్ ట్యాగ్‌తో ట్విటర్‌లో ఆయన ప్రశ్నలు సంధించారు.



