పంటలను నాశనం చేస్తున్న కోతుల బెడదను నియంత్రించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌పంటలను నాశనం చేస్తున్న కోతుల బెడదను నియంత్రిండానికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖలు మరియు ఏజెన్సీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక ఉపశమన ప్రణాళికను రూపొందించడానికి సోమవారం బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో నిర్వహించిన అంతర్‌ ‌శాఖల మరియు అంతర్‌ ఏజెన్సీల సమీక్షా సమావేశంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి వ్యూహాల రూపకల్పనపై చర్చించారు.

ఈ సందర్భంగా నిపుణుల కమిటీ కోతుల బెడదను నియంత్రించేందుకు పలు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలను సూచించింది. ఈ సమావేశంలో పిసిసిఎఫ్‌ ఆర్‌ఎం ‌డోబ్రియాల్‌, ‌స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ ఎంఏయుడి అరవింద్‌ ‌కుమార్‌, ‌పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ అధర్‌ ‌సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌రోనాల్డ్ ‌రోస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *