హైదరాబాద్, పిఐబి, జనవరి 17 : బస్తీ జిల్లాలో ఏర్పాటు చేసిన సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 యొక్క రెండో దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. బస్తీ లోక్ సభ నియోజకవర్గం ఎంపి హరీశ్ ద్వివేదీ బస్తీ జిల్లాలో సాంసద్ ఖేల్ మహాకుంభ్‌ను 2021వ సంవత్సరం నుండి నిర్వహిస్తూ వొస్తున్నారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23ను రెండు దశలలో నిర్వహించడం జరుగుతున్నది. ఒకటో దశను 2022 డిసెంబర్ 10వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు నిర్వహించడమైంది. రెండో దశను 2023 జనవరి 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్‌స్‌లో వివిధ పోటీలు ఖేల్ మహాకుంభ్‌లో భాగంగా ఉంటాయి.
ఇవి కాక విడిగా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లులను తీర్చిదిద్దడం వంటి వాటిలో పోటీలను కూడా ఖేల్ మహాకుంభ్‌లో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖేల్ మహాకుంభ్ అనేది బస్తీ జిల్లాతో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల యువతీ యువకులకు క్రీడలలో వారి యొక్క ప్రతిభను చాటుకోవడానికి ఒక అవకాశాన్ని మరియు ఒక వేదికను అందించేటటువంటి ఒక నూతన కార్యక్రమం మాత్రమే కాకుండా క్రీడలను వృత్తి ప్రధానమైన ఐచ్ఛికంగా కూడా ఎంచుకోవడంలో వారికి ప్రేరణను ఇస్తున్నది. ఈ కార్యక్రమం ఆ ప్రాంత యువతలో క్రమశిక్షణ, ఒక జట్టు వలె కలసికట్టుగా శ్రమించడం, ఆరోగ్యకరమైన స్పర్థ, ఆత్మ విశ్వాసం, ఇంకా జాతీయత భావనలను అలవరచడానికి చేపడుతున్న ఒక ప్రయాసగా కూడా ఉంది.




