నేడు మెట్రో ఫేజ్‌-2‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన

మెట్రో ఎండి ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెట్రోపై విజన్‌తో ఉన్నారని మెట్రో ఎండీ ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌ ‌వరకు మెట్రో విస్తరణ పనులకు శుక్రవారం సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌విఎస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…హయత్‌నగర్‌ ‌వరకూ మెట్రో ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారని చెప్పారు. ఎంఎంటీఎస్‌ ‌రెండో దశను కూడా చేయాలని సీఎం అన్నారని, కేంద్రం నుంచి అనుమతి వొచ్చిన వెంటనే బీహెచ్‌ఈఎల్‌ ‌నుంచి లక్డీకాపూల్‌ ‌వరకు మెట్రో ప్రారంభిస్తామని ప్రకటించారు.

ఏర్పేట్‌ ‌మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని, మెట్రో ఫేజ్‌ 1 ‌విజయవంతంగా పూర్తిచేశామని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రోలో 31 కోట్ల 50 లక్షల మంది ప్రయాణించారని, 3,834 కిలోవి•టరు ఇప్పటి వరకు మెట్రో తిరిగిందని పేర్కొన్నారు. 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్‌, ‌డీజిల్‌ ఆదా అయిందని, రెండు డీపీఆర్‌లు కేంద్రానికి పంపామని ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *