సిఎం కేసీఆర్ పర్యటన ఆదివారం హుస్నాబాద్‌లో ఉన్నందున శనివారం మంత్రి హరీష్ రావు మరోసారి హుస్నాబాద్‌లో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది. మూడురోజుల క్రితం మంత్రి హరీష్ రావు హుస్నాబాద్‌లో పర్యటించి సభాస్థలిని సందర్శించి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సిఎం కేసీఆర్ ఎన్నికల పర్యటన నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం, మరోవైపు పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. రాజకీయ వర్గాల్లో సిఎం పర్యటన ఉత్కంఠను రేపుతుంది.
నేడు మరోసారి మంత్రి హరీష్ రావు హుస్నాబాద్ రాక





