- అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన
- యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్…కలవడంపై బిజెపి విమర్శలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర మహారాష్ట్రలో నిరాటంకంగా ముందుకు సాగుతుంది. ప్రజలు అడుగడుగున్నా నీరాజనం పడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా కలసి నడుస్తున్నారు.

మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు సైతం రాహుల్ జోడోకు మద్దతుగా నిలుస్తున్నారు. శనివారం ఉదయం మహారాష్ట్రలోని షేగాన్ నుంచి జల్గావ్ వరకు యాత్ర సాగింది. కాగా నేడు యాత్ర మహారాష్ట్రలో ముగించుకుని మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనింది. రేపు యాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రాంతీయ నేతలతో రాజకీయ చర్చలు చేస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఆ రాష్ట్రంలోని వాషిమ్‌లో మేధా పాట్కర్‌తో కలిసి నడిచారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని..సోషల్ వి•డియా ద్వారా ఎన్నికలను రిగ్గింగ్ చేయవచ్చని, సోషల్ వి•డియా కంపెనీలు కోరుకుంటే, వారు ఏ పార్టీనైనా ఎన్నికల్లో గెలిపించగలరు. ఒక సిద్దాంతం, దాని నాయకులు సమాజంలో అశాంతిని కలిగించడానికి మతపరమైన హింసను వ్యూహాత్మక ఆయుధంగా పెంచుతున్నారని అన్నారు.

అయితే గుజరత్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినవారితో రాహుల్ గాంధీ చేతులు కలిపారని.. మేధా పాట్కర్ గుజరాతీ వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహించింది. ఈ మేరకు కమలం పార్టీ శుక్రవారం రాహుల్ గాంధీ వి•ద, కాంగ్రెస్ పార్టీ వి•ద మండిపడింది.




