నేడు పోర్ట్ ‌బ్లయర్‌లో కొత్త టర్మినల్‌ ‌బిల్డింగ్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 17 : నేడు పోర్ట్ ‌బ్లేయర్‌లో వీర్‌ ‌సావర్‌కర్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం యొక్క నూతన ఇంటిగ్రేటెడ్‌ ‌టర్మినల్‌ ‌బిల్డింగును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రకృతి నుండి ప్రేరణను పొందిన ఈ భవనం యొక్క వాస్తుశిల్ప ఆకృతి ఒక శంఖం ఆకారాన్ని పోలివున్నట్లుగా కనుపిస్తుంది. దీవుల పర్యావరణం పైన కనీస స్థాయి ప్రతికూల ప్రభావం ఉండేటట్లుగా చూడడానికి గాను దీనిలో సంరక్షణతో ముడిపడ్డ అనేక ప్రత్యేకతలను జతపరిచారు. క్రొత్తఇంటిగ్రేటెడ్‌ ‌టర్మినల్‌ ‌బిల్డింగ్‌ ‌ప్రతి ఏటా సుమారు 50 లక్షల మంది యాత్రికుల రాకపోకలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుంది. ఈ టర్మినల్‌ ‌ద్వారా ఆ ప్రాంతంలో పర్యటనకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభించడంలో తోడ్పాటు లభించనుంది.

ఈ నూతన ఇంటిగ్రేటెడ్‌ ‌టర్మినల్‌ ‌బిల్డింగు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌మాధ్యం ద్వారా ప్రారంభించనున్నారు. క్రొత్త ఏకీకృత టర్మినల్‌ ‌భవనాన్ని నిర్మించడానికి సుమారుగా 710 కోట్ల రూపాయలు వెచ్చించడమైంది. ఈ క్రొత్త టర్మినల్‌ ఈ ‌కేంద్ర పాలిత ప్రాంతంలో సంధాన వృద్ధికి కీలక పాత్రను పోషిస్తుంది. ఇంచు మించు 40,800 చదరపు మీటర్‌ల మొత్తం నిర్మాణ క్షేత్రాన్ని కలిగివున్న ఈ క్రొత్త టర్మినల్‌ ‌భవనం ప్రతి సంవత్సరం ఇంచుమించు 50 లక్షల యాత్రికుల రాక పోకలను సంబాళంచగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.

పోర్ట్ ‌బ్లయర్‌ ‌విమానాశ్రయంలో బోయింగ్‌-767- 400 ‌రకం విమానాలు రెండు మరియు ఎయర్‌ ‌బస్‌-321 ‌రకం విమానాలు రెండు ఆగేందుకు అనువుగా ఉండే ఒక ఏప్రన్‌ను 80 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ విమానాశ్రయం ఇక ఏక కాలంలో పది విమానాలను నిలిపి ఉంచే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.  ఈ సువిశాలమైన క్రొత్త ఏకీకృత టర్మినల్‌ ‌గగన తల రాకపోకలను పెంపొందింప చేయడంతో పాటుగా ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనితో స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించడంతో పాటు ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందించడంలోనూ ఇది సాయపడగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *