నేడు ఎల్బీ స్టేడియంలో సానియా ఫేర్‌వెల్‌ ‌మ్యాచ్‌

‌హైదరాబాద్‌,‌మార్చి4: నగరంలో ఆదివారం టెన్నిస్‌ ‌స్టార్‌ ‌సానియా ర్జా ఫేర్‌ ‌వెల్‌ ‌మ్యాచ్‌ ‌జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. టెన్నిస్‌ ‌కు ఇప్పటికే సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ ‌లో చివరి మ్యాచ్‌ ‌హైదరాబాద్‌లో ఆడాలని భావించింది. సొంత గడ్డపై ఫేర్‌ ‌వెల్‌  ‌మ్యాచ్‌ ఆడనుండటం సంతోషంగా ఉందని సానియా ర్జా తెలిపింది. హైదరాబాద్‌ ‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పింది. రిటైర్మెంట్‌ ‌తర్వాత ఫ్యామిలీకి అధిక సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చింది.

అటు హోమ్‌ ‌టౌన్‌లో అభిమానుల కోసం ఆడబోతున్న ఈ మ్యాచ్‌కు ఫుల్‌ ‌క్రేజ్‌ ఏర్పడింది. భారత టెన్నిస్‌  ‌స్టార్‌ ‌సానియా ర్జా తన 20ఏళ్ల  కెరీర్‌ను ఫిబ్రవరి 21న ముగించింది. దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో టెన్నిస్‌  ‌కెరీర్‌ ‌కు వీడ్కోలు పలికింది. తన చివరి గ్రాండ్‌ ‌స్లామ్‌ ఆస్టేల్రియా ఓపెన్‌ ‌మిక్సడ్‌ ‌డబుల్స్ ‌లో రన్నరప్‌గా నిలవగా…దుబాయ్‌ ‌డ్యూటీ ఫ్రీ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *