నీవు అందరిలాగే పుట్టావు
కాని నీవు పెరిగిన పరిసరాలు
నీ బుద్దిని కలుషితం చేసాయ్‌

‌నీవు అందరిలా మంచోడివే
కాని ‘నేనే’ అనే అహంకారపు
పొరలు నీ కళ్ళను కమ్మేశాయ్‌

‌నీవు మంచిస్వభావం కలవాడివే
కాని గురివింద గింజ స్వభావం
నీకు మద్యలో అలవడింది

నీ మనసు  నిర్మలమయ్యిందే
కాని నేటి ప్రసార మాధ్యమాలు
నీ వ్యక్తిత్వాన్ని కల్మషం చేసాయ్‌

‌గుప్పెడంత మనసు విప్పిచూడు
నీకన్నా గొప్పవాళ్ళు కనిపిస్తారు
బిగించిన పిడికిలి సడలించి చూడు
విశ్వమంతా ప్రేమ కనిపిస్తుంది

స్వేదంతో లిఖిస్తున్న నా అక్షరాలు
ప్రేమతో పలకరించే నా పదాలు
వేదనతో నిర్మిస్తున్న నా వాక్యాలు
నీ అవివేకపు తెరలను తొలగిస్తాయిలే

– కయ్యూరు బాలసుబ్రమణ్యం
7780277240

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *