‘‘అసలు బడ్జెట్ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ,వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.’’
బడ్జటు లేదా బడ్జెట్ అను పదం ప్రస్తుతం ఆదాయ, వ్యయాల ప్లానింగునకు చిన్న కుటుంబం నుండి పెద్ద దేశం వరకూ ఉపయోగిస్తున్నారు. అసలు బడ్జెట్ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ, వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.
భారత బడ్జెట్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ఆ నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం, వ్యయాల ఆర్థిక ప్రకటన. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 మధ్య కాలానికి కేంద్ర బడ్జెట్ తయారుచేయబడుతుంది.దీనిని రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్‌గా వర్గీకరించారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కావడంతో దీనిపై ఈసారి అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఒకవైపు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది.. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ఈ సారి బడ్జెట్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గాలా? ఎన్నికల వేళ జనాకర్షణకు పట్టం కట్టాలా? మోదీ సర్కార్ ముందు ఈ రెండు సవాల్ విసురుతున్నాయి. దేనికి మొగ్గుచూపినా మరోదానిపై మాత్రం ప్రభావం తప్పదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ చదివిన బడ్జెట్‌పై అందరి కళ్లూ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ ఆర్థికాన్ని మరింత పరుగులు తీసే దిశగా.. బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? మార్పులు, తాయిలాలు కోరుకుంటున్న వివిధ వర్గాల్ని ఎలా సంతృప్తి పరుస్తారనేదే అంతిమంగా అందరికీ అవసరం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ ను దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా అభివర్ణించారు. దేశ ఆర్థిక పురోగతి మంచి స్థానంలో ఉందన్నారు. వివిధ రంగాలకు కేటాయింపులపై ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో బడ్జెట్‌లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నామని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఆర్థిక మంత్రి.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అంశాలు….
తొమ్మిదేళ్లలో దేశంలో తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామన్నారు. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించామని అన్నారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్స్‌లో పురోగతి సాధించామని అన్నా•రు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. వంద కోట్ల మందికి 220 కోట్ల టీకా డోస్‌లను పంపిణీ చేశాం.. 2047 లక్ష్యంగా దిశగా ప్రభుత్వ పథకాలు..
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు కేటాయింపులను ప్రకటించారు. 2023-24 వార్షిక బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45.03 లక్షల కోట్లు అని ప్రకటించారు. బడ్జెట్ లో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడించారు.
వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు.
శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం.
పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం.
గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు.
వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు.
వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు.
రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు.
దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్.
పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు
ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం.
నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం.
గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు.
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు.
రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు.
కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు.
ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు.
ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం.
పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు.
5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు.
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు.
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు.
మధ్యతరగతి బ్రతుకుల ఆశలు తీరేనా?
సాధారణంగా బడ్జెట్ అంటేనే.. చాలా వర్గాలు ప్రయోజనాలను కోరుకుంటాయి. పారిశ్రామిక, వైద్య, విద్య, ఆరోగ్యం ఇలా ఏదైనా కానీ.. ఈసారి మాత్రం మధ్యతరగతి వర్గం ఆశగా ఎదురుచూస్తోంది. రూ.5 నుంచి 10 లక్షల వార్షికాదాయం ఉండే మధ్యతరగతి వారిపై ద్రవ్యోల్బణం ప్రభావం భారీగానే పడింది. దీంతో.. వీళ్లకు ఏమైనా రాయితీలు ఇస్తుందా అనేది చూడాలి. వాళ్లు కూడా అదే కోరుకుంటున్నారు. ఆదాయం తగ్గుతుండటం, ఉద్యోగాల్లో కోతలుండటం, ఖర్చులు పెరుగుతుండటం నేపథ్యంలో.. తమ ఊరటను ఇచ్చే ప్రకటనల కోసం ఎదురుచూసారు..
తెలంగాణ వాట…
తెలంగాణ వాటా 21వేల 470 కోట్లు కేంద్రం ప్రకటించింది.
ఐఐటి హైదరాబాద్‌కు %జు••% కింద 300 కోట్లు కేటాయించారు.
సింగరేణికి 1,650 కోట్ల రూపాయలు వచ్చాయి.
సాలార్జంగ్ మ్యూజియంతోపాటు.. దేశంలోని అన్ని మ్యూజియాల 357 కోట్లు కేటాయించారు.
మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌కు (కోటాలోని ప్లాంట్‌తో కలిపి) రూ.1,473 కోట్లు,
రెండు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.37 కోట్లు,
బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ హాస్పిటల్స్ కు – రూ. 6,835 కోట్లు.
ఇవి చౌక, తగ్గేవి…
మొబైల్ విడిభాగాలపై, టీవీలు, ఎలక్ట్రిక్ వస్తువులు, కిచెన్ చిమ్నీలు, హీట్ కాయిల్స్, కెమెరా లెన్స్, బయోగ్యాస్ ఎలక్ట్రిక్ కార్లు, బొమ్మలు, సైకిళ్లు, లిథియం అయాన్ బ్యాటరీలు
ఇవి ఖరీదైనవి, పెరిగేవి…
టైర్లు, సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాలు, బ్రాండెడ్ దుస్తులు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు
జాజుల దినేష్.
ఎంఏ. (ఏంఎడ్,) సెట్, పిజిడిసిఎ. పొలిటికల్ సైన్స్ లెక్చరర్. 9666238266




