నిరుపేదలకు సేవ చేయటం లోనే ఆనందం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : నిరుపేదలకు సేవ చేయడంలోనే ఎంతో ఆనందం దాగి ఉందని కడ్తాల్ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బీద ప్రజలతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రతిరోజు తన కుమారుని జ్ఞాపకార్థం వంద నుంచి 150 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *