నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

  • పోలీస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల
  • మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్‌ ‌నియామకాలకు సర్కార్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16,027 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది ప్రభుత్వం.. అందులో టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు 5,010, సివిల్‌ ‌కానిస్టేబుళ్లు 4,965 పోస్టులు, ఏఆర్‌ ‌కానిస్టేబుళ్లు 4,423 పోస్టులు ఉండగా.. 414 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ ‌వొచ్చేసింది. ఇక, స్పెషల్‌ ‌పోలీస్‌ ‌ఫోర్స్ 390, ‌ఫైర్‌ 610, ‌డ్రైవర్స్ 100‌గా పోస్టులు ఉన్నాయి..

మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. వెబ్‌సైట్‌ ‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు చైర్మన్‌ ‌వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో ప్రకటించిన విధంగా తెలంగాణలో పోలీస్‌ ‌నియామకాలకు నోటిఫికేషన్‌ ‌విడుదలైంది.  కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ ‌పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *