- దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
- పునాది రాయిని వేసిన ప్రాజెక్టుల ను పూర్తి చేయడం అనేది మా ప్రభుత్వం శ్రమ సంస్కృతి : ప్రధాని
పీ ఐ బీ ,హైదరాబాద్, అక్టోబర్ 3:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళ వారం నిజామాబాద్ లో విద్యుత్తు, రైలు మరియు ఆరోగ్యం ల వంటి ముఖ్య రంగాల లో 8,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన పలు అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడంతో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల లో ఎన్ టిపిసి కి చెందిన 800 మెగావాట్ సామర్థ్యం కలిగిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఒకటో దశ యూనిట్, మనోహరాబాద్ ను మరియు సిద్ధిపేట ను కలుపుతూ సాగిపోయే ఒక క్రొత్త రైల్ వే లైనుబీ ధర్మాబాద్ – మనోహరాబాద్ – మరియు మహబూబ్ నగర్ – కర్నూల్ మధ్య విద్యుతీకరణ పథకం వంటి రైలు ప్రాజెక్టులు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి – ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ లో భాగం గా రాష్ట్రం లో వివిధ చోట్ల నిర్మాణం జరుగనున్న 20 క్రిటికల్ కేర్ బ్లాక్స్ (సిసిబి స్) కు ఆయన శంకుస్థాపన చేశారు. నరేంద్ర మోదీ సిద్ధిపేట్ – సికందరాబాద్ – సిద్ధిపేట్ రైలు సర్వీసు కు కూడా పచ్చజెండా ఊపారు.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న మొదలు పెట్టుకొన్న ప్రాజెక్టుల కు గాను తెలంగాణ ప్రజల కు అభినందన లు తెలియ జేశారు. ఏ దేశం లేదా ఏ రాష్ట్రం అభివృద్ధి అయినా ఆ దేశం లేదా రాష్ట్రం లకు ఉన్న విద్యుశ్చక్తి సంబంధి ఆత్మనిర్భరత సామర్థ్యం పైన ఆధారపడుతుంది. ఎందుకంటే, అదే జరిగిన నాడు జీవించడం లో సౌలభ్యం మరియు వ్యాపారం చేయడం లో సౌలభ్యం అనేవి ఏక కాలం లో మెరుగు పడతాయి కాబట్టి అని ఆయన వివరించారు. ‘‘విద్యుశ్చక్తి సరఫరా సాపీగా సాగినప్పుడు ఆ పరిణామం ఏదైనా రాష్ట్రం లో పరిశ్రమల వృద్ధి కి వేగాన్ని అందిస్తుంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా లో ఎన్ టిపిసి కి సంబంధించిన 800 మెగావాట్ యూనిట్ సామర్థ్యం కలిగిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యొక్క ఒకటో దశ ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. అతి త్వరలోనే రెండో యూనిట్ సైతం పని చేయడం మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ యూనిట్ నిర్మాణం పూర్తి అయింది అంటే గనుక విద్యుత్తు ప్లాంటు స్థాపిత సామర్థ్యం 4,000 మెగా వాట్ స్థాయి కి పెరుగుతుంది అని ఆయన తెలిపారు.
దేశం లో ఎన్ టిపిసి కి ఉన్న విద్యుత్తు ప్లాంటులు అన్నింటి లోకి అత్యంత ఆధునికమైన విద్యుత్తు ప్లాంటు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యే కావడం పట్ల ఆయన సంతోషాన్ని ప్రకటించారు. ‘‘ఈ పవర్ ప్లాంటు లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు లో పెద్ద భాగం తెలంగాణ ప్రజల కు దక్కుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పునాదిరాళ్ళు వేసిన ప్రాజెక్టుల ను పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రవృత్తిని ఆయన ఈ సందర్భం లో నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టు కు 2016వ సంవత్సరం లో శంకుస్థాపన జరిగిన సంగతి ని ఆయన గుర్తుకు తీసుకు వస్తూ, దీనిని ఈ రోజు న ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞత ను తెలియ జేశారు. ‘‘ఇది మా ప్రభుత్వం సరిక్రొత్త శ్రమ సంస్కృతి’’ అని ఆయన అన్నారు.
తెలంగాణ శక్తి అవసరాల ను తీర్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. హసన్ – చర్లపల్లి గొట్టపు మార్గాన్ని ఇటీవలె దేశ ప్రజల కు అంకితం చేసిన సంగతి ని ఆయన గుర్తు చేసారు. ‘‘ఈ పైప్ లైన్ తక్కువ ఖర్చు లో పర్యావరణాని అనుకూల పద్ధతి లో ఎల్ పిజి రవాణా కు మరియు పంపిణీ కి ఆధారం అవుతుంది’’ అని ఆయన అన్నారు.ధర్మాబాద్ – మనోహరాబాద్ మరియు మహబూబ్ నగర్ – కర్నూలు ల మధ్య విద్యుదీకరణ పథకాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అవి ఈ రెండు రైళ్ళ సరాసరి వేగాన్ని పెంచడం తో పాటుగా, రాష్ట్రం లో కనెక్టివిటీని అధికం చేస్తాయి అన్నారు. ‘‘భారతీయ రైల్ వే లు రైలు మార్గాలన్నింటి లోను వంద శాతం విద్యుదీకరణ అనే లక్ష్యం దిశ లో పయనిస్తోంది’’ అని ఆయన అన్నారు. మనోహరాబాద్ మరియు సిద్ధిపేట్ మధ్య క్రొత్త రైలు లింకు, అటు పరిశ్రమ కు ఇటు వ్యాపారానికి ఊతాన్ని అందిస్తుంది అని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు కు 2016 వ సంవత్సరం లో శంకుస్థాపన చేయడాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.
ఆరోగ్య సంరక్షణ అనేది మునుపు ఏ కొద్ది మందికో చెందిన రంగంగా ఎలా ఉండిందీ ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఆరోగ్య సంబంధి సేవల ను అందరికీ అందుబాటు లో ఉండేటట్లుగాను, అలాగే అందరూ భరించగలిగే స్థాయి లో ఉండేటట్లు గాను తీసుకొన్న అనేక చర్యల ను గురించి నరేంద్ర మోదీ వివరించారు. బీబీనగర్ లో ఒక ఎఐఐఎమ్ఎస్ సహా, ఎఐఐఎమ్ఎస్ లు మరియు వైద్య కళాశాల ల సంఖ్యలు వృద్ధి చెందుతూ ఉండడాన్ని గురించి ఆయన మాట్లాడారు. అదే కాలం లో వైద్యుల సంఖ్య ను పెంచే కార్యం సైతం జరిగింది అని ఆయన వివరించారు.ప్రతి ఒక్క జిల్లా లో మౌలిక సదుపాయాల నాణ్యత విషయం లో పూచీ పడడం కోసం పిఎమ్ ఆయుష్మాన్ భారత్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను తీసుకు రావడం జరిగింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ రోజు న ఈ మిశన్ లో భాగం గా తెలంగాణ లో 20 క్రిటికల్ కేర్ బ్లాకుల కు శంకుస్థాపన చేయడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు.
ఈ బ్లాకుల ను ఏ విధం గా తీర్చిదిద్దడం జరుగుతుంది అంటే, వాటిలో ప్రత్యేకమైన ఐసలేశన్ వార్డులు, ఆక్సిజన్ సరఫరా మరియు సంక్రమణ నిరోధం, ఇంకా నియంత్రణ లకు సంబంధించిన పూర్తి ఏర్పాటులు ఉంటాయి అని ఆయన వివరించారు. ‘‘తెలంగాణ లో ఆరోగ్య సదుపాయాల ను పెంచడం కోసం ఇప్పటికే 5,000 లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లు విధుల ను నిర్వహిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన కాలం లో తెలంగాణ లో 50 పెద్ద పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడమైంది. అవి ప్రజల అమూల్యమైన ప్రాణాల ను కాపాడడం లో కీలకమైన పాత్ర ను పోషించాయి’’ అని ప్రధాన మంత్రి తెలిపారు. విద్యుత్తు, రైలు మార్గాలు మరియు ఆరోగ్యం ల వంటి ముఖ్య రంగాల లో ఈ రోజు న ఆరంభించుకొన్న ప్రాజెక్టుల కు గాను ప్రజల కు అభినందనల ను తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మరియు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





