పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 28: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కూల్ గ్రామంలో ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ …ఎలా అయితే చిట్కూల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానో తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత పటాన్ చెరు నియోజకవర్గంని కూడా దేశానికి ఆదర్శంగా అభివృధి చేస్తానని నీలం మధు అన్నారు. పది భరోసాలతో అన్ని వర్గాల ప్రజలు అభివృధి చెందుతారని తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఇదంతా సాధ్యమైందని, నీలం మధు గెలిస్తే పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలంతా గెలిచినట్టు అని తెలిపారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో అందరు సీరియల్ నెంబర్ 5 ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనని ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు, ఎన్ ఎన్ఎం ఆర్ యువసేన కార్యకర్తలు,నీలం మధు అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.
నిండు మనసుతో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి




