నా కల నెరవేరింది..స్థలాన్ని ఇవ్వడం సంతోషంగా ఉంది : మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మిమ్మల్ని గుర్తించి స్థలాన్ని అందించే కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయా కుల సంఘాలకు స్థల మంజూరు కల నెరవేరింది. మీ ఐక్యతకు ఈ సంఘాలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
సిద్ధిపేట అంటే పరిశుభ్రతకు మారుపేరు. స్వచ్ఛతలో మీరంతా భాగస్వామ్యం కావాలి. ప్రజాలందరీ భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం అవుతుంది. విద్య, వైద్యం, ఆలయాలు, అభివృద్ధి నిర్మాణాలలో అన్నింటా ఆదర్శంగా నిలిచింది. మీ ప్రేమ. ఆదరాభిమానం. ఉన్నంత కాలం సిద్ధిపేట అభివృద్ధికై నా శక్తి ధారపోస్తానని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం లైట్ మోటారు వెహికిల్ అసోసియేషన్, భట్రాజ్ సంఘం, మొండివారు, మొండి సంఘం, మొబైల్ అసోసియేషన్ లకు స్థల భవనాలు మంజూరు చేసి సంబంధిత ప్రొసీడింగ్ కాపీలు ఆయా సంఘ ప్రతినిధులు, సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థలం కేటాయించిన సంఘాలకు త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 కుల సంఘాలకు స్థలాన్ని ఇవ్వడంతో పాటుగా భవనాలు నిర్మించి ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు కుల సంఘ ప్రతినిధులు గత ఏ ప్రభుత్వాలు తమను పట్టించుకున్న దాఖలాలు లేవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, మొబైల్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు, ప్రతినిధులు వెంకట్, సునీల్, రాజిరెడ్డి, లైట్ మోటారు వెహికిల్ సంఘం అధ్యక్షుడు రమేశ్, భట్రాజ్ సంఘం దయానంద్, అశోక్, సంచార జాతుల మొండివారు-మొండి బండ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *