పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: గత ప్రభుత్వాల హయాంలో నిధుల కొరతతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండల పరిధిలోని భానూర్, నందిగామ గ్రామాలలో మూడు కోట్ల 45 లక్షల రూపాయల అంచనా భయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.పాటి గ్రామంలో 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న దర్గా ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పనులను గత 10 సంవత్సరాలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసి చూపెట్టడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయడంతో పాటు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్షల రూపాయల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించడంతోపాటు, అర్హులైన వారికి గ్రామాలలో 75 గజాల ఇళ్లస్థలం అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.నందిగామ, భానూర్ గ్రామాల పరిధిలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాల సముదాయాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడాలని, మిగిలిన రోజులు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైందని, ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.పండుగల ముందు వివిధ రకాల వేషాలు వేస్తూ కొత్త బిచ్చగాళ్లు వచ్చే విధంగా..రాబోయే రోజుల్లోనూ ఓట్లు అడిగేందుకు అమలుకు చేతకాని హామీలు గుప్పిస్తూ వివిధ పార్టీల నాయకులు ప్రచారానికి వస్తారని, ప్రజలు మోసపోవద్దని కోరారు.ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలు చేయని హామీలను, తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగల్బాలు పలకడం వారి మోసానికి నిదర్శనమని విమర్శించారు
ప్రతిపక్షాల విమర్శలై ప్రభుత్వానికి దీవెనలని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, సర్పంచులు ఉమావతి గోపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్, ఎంపీటీసీలు నాగజ్యోతి లక్ష్మణ్, యాదగిరి, కార్పోరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, స్వామి గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


