నమ్మకద్రోహి పైలెట్ రోహిత్ రెడ్డిని ఓడించడమే ఏకైక లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నమ్మకద్రోహి అయినా పైలెట్ రోహిత్ రెడ్డి ని ఓడించడమే ఏకైక లక్ష్యం అని చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ కు మద్దతుగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గురువారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బిజెపి పార్టీకి బద్లాం చేసి ప్రధాని మోడీ ముఖానికి మసిరాశి బిఎల్ సంతోష్ అటువంటి నాయకుడికి ఉమ్మివేసిన వాడిని రాజకీయంగా బొంద పెట్టాలని అన్నారు. పది పైసలకు ఎవ్వడు కొనని బేకార్ గాడిని 100 కోట్లకు ఎవరు కొంటారని అన్నారు. తానే అమ్ముడికి సిద్ధమై కెసిఆర్ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్కు అడ్డంగా దొరికి బిజెపి పార్టీని బద్లాం చేశారని విమర్శించారు. ఒక డ్రగ్స్ ఒక సాండ్ గంజా ల్యాండ్ మాఫియా ను ఎవరు కొంటారని, వాడే ఇతరులను కొంటున్నారని ఆరోపించారు. తాండూరులొ ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇప్పటివరకు తాండూర్ లో ఇలాంటి డ్రగ్స్ ల్యాండ్ సాండ్ మాఫియాను చూడలేదని అన్నారు.  ఇలాంటి బేకర్ గాడిని తాండూరు ప్రజలు రాజకీయంగా బొంద పెట్టాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిందని ఎక్కడ చూసిన విద్యార్థులకు కనీస వసతులు లేవని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డొక్కా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ దళిత బంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తండ్రి కొడుకులు అబద్ధాలతోనే ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రి కొడుకులు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తా లేదని తామే చేస్తున్నామని అబద్ధం ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజమైన సంక్షేమ పథకాలు అంటే ప్రధాని మోడివేనని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమూరి శంకర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి వేమూరి శంకర్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ కౌన్సిలర్ అంతారం లలిత హలోరు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *