తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ముందస్తు మేనిఫెస్టో ప్రకటిం చింది. 65 ఏండ్లు అధికా రంలో ఉండి,తాము అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ఏదో చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడేందుకు కారణం ఈ కాంగ్రెస్ కాదా ? నాడు ఇందిరాగాంధీ హయాంలో తోలి తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? ఇదే కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కోవర్టులుగా మార్చుకొని మలిదశ ఉద్యమంలో అడుగడుగునా ఆంక్షలు పెట్టి ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నది.
2009లో రాష్ట్ర ప్రకటన చేసింది తెలంగాణ మీద ప్రేమతో కాదుకదా ? తెలంగాణ ప్రజలు ఎలాంటి ఉద్యమం చేయకపోయినా కాంగ్రెస్ పనిగట్టుకొని తెలంగాణ ఇచ్చిందా? కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షను చూసే కదా? కేసీఆర్ దీక్ష చేయ కుంటే తెలంగాణ ప్రజలు ఆత్మబ లిదానాలు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేదా? దశాబ్ద కాలం 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఇవ్వకుండా ఎందుకు నాన్సింది ? కాంగ్రెస్ కు ప్రేమ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ముల్కి నిబంధనలను తొలిగించేది కాదుకదా? తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఇక్కడ అభి వృద్ధికి ఆటంకం కల్గిస్తూ, నిధులు కొల్లగొట్టాలన్నా సోయితో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రారంభించిన మలిదశ ఉద్యమ పోరాటాన్ని చూసి భయపడి కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.తెలంగాణ ప్రజలు కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ.ఎవరి దయాదాక్షిణ్యాల మూలంగా వచ్చింది కాదు.దీన్ని విస్మరించి కాంగ్రెస్ నాయకులు రేవంత్, కోమటిరెడ్డి, బట్టి, శ్రీధర్ బాబు,మాణిక్ రావ్ ఠాక్రే వంటి కాంగ్రెస్ నేతలు తామే ఏదో బిచ్చం వేసినట్లు మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ మైండ్ గేమ్ లో భాగంగా స్వంత సర్వేలతో విజయం మాదేనని విర్రవీగుతున్నారు .తెలంగాణ నిత్య చైతన్యశీలమైన గడ్డ ఇక్కడి ప్రజలు అరవై ఏండ్ల పాటు పోరాటం చేసి తమ ఉద్యమ ఆకాంక్షలను నిజం చేసుకున్నవాళ్ళకు ఎవరు ఏమిటో తెలియదా? బాకీ తీర్చుకునేందుకు సునిశితంగా గమనిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ , కాకతీయ విశ్వవిద్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.నాడు క్యాబినెట్ లో ఉన్న ఉత్తమ్, జానారెడ్డి, డీకే అరుణ ,శ్రీధర్ బాబు లాంటి వారు విద్యార్థుల ఉద్యమాన్ని ఎగతాళి చేసినవారే.కానీ ఇప్పుడు ఉద్యమ కారులపై ప్రేమ ఒలకబోస్తున్నారు.ఇదే ఓయూలో ముళ్లక ంచెలు, ఇనుప బూట్లతో తొక్కుతూ, బాష్ప వాయుగోళాలతో ,విద్యార్ధి నాయకులపై లాఠీలు రaళిపించి, బుల్లెట్ల వర్షం కురిపించి గాయాలపాలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడికి వెళ్ళినారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులూ నాటి అకృత్యాలను మర్చిపోయారేమో గాని, ఉద్యమకారులు , సబ్బండ వర్గాలు, విద్యార్థులు మరిచిపోలేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పాలనా తెలియందేమీకాదు.
60ఏండ్లు భరించారు కదా? మేమే ఇచ్చినాము అని చెప్పే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏ ఒక్కటి అమలు చేయక పోయినా, విభజన హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడిరదా? తెలంగాణ కు జరుగుచున్న అన్యాయాలపై బీఆర్‌ఎస్ ఎంపీలు నిలదిస్తూంటే మద్దతుగా నిలిచారా? కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారం చెలాయించడం తప్ప ఏనాడైనా తెలంగాణ ప్రజలు కష్టాలు పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ గడ్డకు ఏం కావాలో ఆకళింపు చేసుకోకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే విద్యార్థులు, యూత్, బీసీలు, రైతులు, మహిళలల డిక్లరేషన్లు ఎందుకు గుర్తొస్తున్నాయి ? ఆరు దశాబ్దాలు అధికారం ఇస్తే చేయని అభివృద్ధి, పట్టించుకోని సంక్షేమం ఒక ఛాన్స్ ఇస్తే ఇరుగదీస్తామని చెప్పినా.. విశ్వసించడం లేదు. కాంగ్రెస్ ప్రాథమికంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (ఉత్తిత్తి హామీలు) రూ.2.9 లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుంది.
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లు మాత్రమే. ఎక్కడనుండి సమకూర్చుకుంటారో చెప్పలేదు. ఇంకా మేనిఫెస్టో లో చేర్చడానికి కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టో కోసం ఎదిరి చూస్తు న్నారు. ఈ ఉత్తర కుమా రులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. రేవంత్ కల్లబొల్లి మాటలను నమ్మే స్థితిలో లేరు. 65 ఏండ్లలో కాంగ్రెస్,టిడిపి చేయని అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసింది. మారుమూల ప్రాంతంలోని ఏ పల్లెను తాకినా అర్థం అవుతుంది. తెలంగాణలో లబ్దిదారుడు లేని గృహం లేదు.మూడేళ్ల పాప నుంచి కాటికి కాళ్ళుచాపిన ముసలిని అడిగితే అనిర్వచ నీయమైన సమాధానం వస్తుందంటే అతిశ యోక్తికాదు.
తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష.కాంగ్రెస్,బీజేపీ వంటి పార్టీల నాయకులు టూరిస్టుల్లా తెలంగాణను రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు కానీ,తెలంగాణ మోడల్ దేశమంతా వ్యాప్తి చెందేవిదంగా కేసీఆర్ ప్రజల కోణంలో పాలనా సాగిస్తున్నారు.తెలంగాణలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని బంగారు తెలంగాణకు బాటలు వేసారూ.ఉద్యమ నేత సీఎం గా ఉండడం వల్లనే సాధ్యం అయిందని తోలి 2014ఎన్నికల్లో పట్టం కట్టారు.రెండవసారి 2018లో ఏకపక్షంగా వార్ వన్ సైడ్ అయ్యింది. ఇప్పుడైతే మొట్ట మొదటగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. 2023లో విజయాన్ని పునరావృతం చేసి హ్యాట్రిక్ సాధిం చాలన్న సంకల్పంతో నిర్మాణాత్మకంగా అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచపటంలోకి ఎక్కించిన కేసీఆర్ లాంటి కారణజన్ముడిని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు విశ్వసించింది.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు, పాదయాత్రలు, బస్సుయాత్రలు తప్ప.. మేము గెలిస్తే తెలంగాణ సమాజంకోసం అక్కరకు వచ్చే పని చేస్తాం అని ఒప్పించే ప్రయత్నం చేయలేదు.ఇప్పటి వరకు ఎవరికీ టికెట్స్ వస్తాయో.. ఎవరికీ రావోనని అయోమయంలో అభర్ధులు ఉన్నారు. ఇంతెందుకు మా ముఖ్యమంత్రి ‘గీ’ పలానా రెడ్డి అని చెప్పే దైర్యం ఉందా? వాండ్ల ఆశలు అంతాకూడా పది సంవత్సరాల పాలనలో వ్యతిరేకత లేకపోతదా? ఎమ్యెల్యేలమీద అసంతృప్తి రాకపోతదా ? మన ఖాతాలో వేసుకొక పోతామా? అనేది వారి ఆత్మ విశ్వాసం. అంతకంటే ఎక్కువ సీను కాంగ్రెస్ కు లేదు.
ఇప్పటికే పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయి, సీనియర్లను విస్మరించి అప్రతిష్టపాలైంది. కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకోక పొతే రాబోయే ఎన్నికల్లో కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ బానిస మనస్తత్వాన్ని ఇంకా వీడలేదు. ఇప్పటికీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అంటూ జబ్బలు చేర్చుకుంటున్నారు. అవును కాంగ్రెస్సే ఇచ్చింది. భారత దేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్య్రం ఇచ్చింది ఎంత నిజమో.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది అంతే నిజం. నాటి బ్రిటిష్ పాలకులకు, నేటి కాంగ్రెస్ పాలకులకు పెద్ద తేడా ఏమి లేదు. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో బ్రిటిష్ వారిని పొగుడుతున్నామా? తెలంగాణ కష్టాలకు,నష్టాలకు ప్రత్యక్షం గా, పరోక్షంగా కారణమైందే కాంగ్రెస్ పార్టీ అనేది జగమెరిగినసత్యం.
డా. సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్, 9866255355





