- గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు బందోబస్తు మధ్య కొనసాగింపు
- భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
- రాముడు 140 కోట్ల మందికి దేవుడు : పూజల్లో పాల్గొన్న
- కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర మంగళవారం సందడిగా సాగింది. గౌలిగూడలోని రామమందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలై తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ వ్నిదుగా తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగింది. దాదాపు 13 కిలోవ్నిటర్ల మేర శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. మరోవైపు శోభాయాత్రకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
టాస్క్‌ఫోర్స్ పోలీస్‌తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. దాదాపు 44 చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని.. ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని పోలీసులు సూచించారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ అంటూ భక్తుల నినాదాలతో శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ..అయోధ్యలో రాంమందిర నిర్మాణం తర్వాత వొచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు. 550 ఏళ్ళ తర్వాత రామ్ మందిర్‌లో దివ్యమైన రాముణ్ణి ప్రతిష్టించుకున్నామని తెలిపారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది వైభవంగా హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందన్నారు. రాముడు దేశంలోని 140 కోట్ల మందికి దేవుడన్నారు. అందరూ శ్రీరామ చంద్రుణ్ణి దర్శించుకోవచ్చని వెల్లడిరచారు. ప్రతీసారి లాగే ఈసారి గ్రాండ్‌గా హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనపై కావాలని పోలీసులు కేసులు పెట్టారని మండిపడ్డారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సుల్తాన్ బజార్, అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టారన్నారు. పోలీసులు శోభాయాత్రను లేట్ చేశారని..తనకేవ్ని కేసులు కొత్తకాదన్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.





