ధాన్యం ఇంకెప్పుడు కొంటారు వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌

వర్షాలతో రైతుల్లో ఆందోళన

కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ‌తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమి లేదని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అసలు ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం ఎందుకు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కల్లాల్లల్లో ఉన్నప్పుడు ఎందుకు టార్పాలిన్‌ ‌కవర్లు సిద్ధం చెయలేదని నిలదీశారు. ఈ వారంలో వర్షాలు పడతాయని తెలిసినా ఇంతగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తడిసిన ధాన్యంతో ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్‌ ‌మాత్రం ఫాంహౌస్‌లో కూర్చోని చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *