జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: జగదేవపూర్ మండల పరిధిలో ని దౌలాపూర్ గ్రామoలో చిలుకూరి బాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిటి హాస్పిటల్ సౌజన్యoతో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్పంచ్ వంటేరు యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గ్రామంలోని నిరుపేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా అన్ని రోగాలకు సంబందించిన బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామని అన్నారు.అలాగే రెండు వందల నుండి మూడు వందల మందికి ఉచితంగా మందులు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో డాక్టర్.దివ్య, డాక్టర్. నిషిత,డాక్టర్. ఓం ప్రకాష్,మాజీ ఉప సర్పంచ్ కదుర్ల రాజు,మార్కెటింగ్ బాయ్స్ బాబూ గౌడ్, శేఖర్, చేరాలు, నందు పంచాయతీ సెక్రటరీ సతీష్, ఆశ వర్క్ పద్మావతి,ఇటిక్యాల సుధాకర్ రెడ్డి,సపయి కార్మికులు మైసయ్య, బాలమ్మ, వెంకటమ్మ, గోళ్లేనా నర్సిములు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
దౌలాపూర్ లో ఉచిత వైద్య మెగా శిబిరం





