దేశంలో విపరీతంగా అప్పులు ఎందుకు చేశారు
తెలంగాణకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం ఎందుకు ఆపారు
హిమాచల్‌లో గెలిపించుకోలేని నేత నడ్డా
తిట్ల పురాణంతో వోట్లు రాలవని గుర్తించాలి
మునుగోడుకు ఇచ్చిన హావి•లు ఏమయ్యాయి
కరీంనగర్ సభలో నడ్డా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : అప్పుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీజేపీయేనని, బీజేపీ అధికారంలోకి వొచ్చినప్పుడు ఈ దేశంలో రూ. 56 వేల కోట్లు అప్పు ఉండే. ఇవాళ రూ. 1,35, 87, 893 కోట్లకు అప్పు చేరింది. 8 ఏండ్ల పాలనలో ఒక కోటి కోట్ల అప్పు చేసిండ్రు. ఏడాదికి దాదాపు రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. నెలకు లక్ష కోట్ల అప్పు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు అన్నారు. కరీంనగర్ బహిరంగ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను విలేఖరుల సమావేశంలో హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఖండించారు. తెలంగాణ ప్రభుత్వంపై నడ్డా చేసిన విమర్శల్లో వాస్తవికత లేదని.. ఆయన మాట్లాడిన దాంట్లో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విషయం ఒక్కటి కూడా లేదన్నారు. ఇప్పటికైనా నడ్డాకు జ్ఞానోదయం కావాలన్నారు. తెలంగాణ అద్భుతంగా పని చేస్తుందని, రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ జీఎస్డీపీ రూ. 4 లక్షల 51 వేల కోట్లు. ఈ ఎనిమిదేండ్లలో రూ. పదంకొండున్నర లక్షల కోట్లకు జీఎస్డీపీ చేరిందన్నారు. ఇది మన పనితీరుకు గీటురాయని, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష 12 వేల 162 రూపాయాలుండెనని, గత సంవత్సరం తలసరి ఆదాయం 2 లక్షల 75 వేల 443 రూపాయాలతో రెట్టింపు అయిందని అన్నారు.
2014లో బీజేపీ అధికారంలోకి వొచ్చినప్పుడు.. ఈ దేశ తలసరి ఆదాయం 79,118 రూపాయాలు ఉంటే మొన్న ఒక లక్ష 50 వేల 7 రూపాయాలు. అంటే దేశం కంటే మన పౌరుల తలసరి ఆదాయం ఒక లక్ష 25 వేల 436 రూపాయాలు అధికంగా ఉన్నది. ఇది తాము చెప్పే లెక్కలు కాదని, కేంద్రం చెప్పిన లెక్కలని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని హరీష్ రావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మునుగోడులో ప్లోరోసిస్ రిసెర్చ్ సెంటర్ పెడ్తమన్నదని, ప్రత్యేక హాస్పిటల్ కట్టిస్తమన్నదని, ఇంకెప్పుడు కడ్తరని, అక్కడి శిలాఫలకాలు మిమ్మల్ని వెక్కిరిస్తున్నన్నాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం నెలకో అవార్డు ఇస్తున్నదని, దిల్లీలో అవార్డులు ఇస్తరని..గల్లీలోనేమో తిడ్తరని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో డెలివరీలలో 66 శాతం ప్రభుత్వ హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయని.. గతంలో ఇది కేవలం 30 శాతమేనని, వైద్యసేవలు రాష్ట్రంలో మెరుగుపడ్డాయని, కేరళ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందని చెప్పారు. సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించామన్న విషయం నడ్డా మరచిపోయారా అని ప్రశ్నించారు. స్వయంగా సీఎం కేసీఆరే ఆ కార్యక్రమంలో పాల్గొన్నరని, జేపీ నడ్డా అప్ డేట్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏమేం జరుగుతోందో తెలుసుకోవాలని హరీష్ రావు సూచించారు. నడ్డా..ఇది పోరాటాల గడ్డ అని హరీశ్‌రావు హెచ్చరించారు. తిట్ల పురాణంతోనో, బట్ట కాల్చి వి•దేయడం ద్వారానో, బురద జల్లడం ద్వారానో, కేసులు పెట్టడంతోనో, దాడులు చేయడం ద్వారానో తెలంగాణ ప్రజల మనసు గెలవలేరని, వి•రు గెలవాలంటే.. గుజరాత్‌కు ఇచ్చినట్లు ప్యాకేజీలు ఇవ్వండని, ఎన్నికల ముందు గుజరాత్‌కు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఇవ్వండని సూచించారు.
అసలు హక్కుగా రావాల్సిన పైసలు ఇవ్వండని అంటూ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకురూ. 24 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పిందని, అవి ఇచ్చి తెలంగాణ ప్రజల మనసు గెలవండన్నారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ. 5, 374 కోట్ల ఇవ్వాలని సిఫారసు చేసిందని, అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి నడ్డా అని ప్రశ్నించారు. ఈ దేశ చరిత్రలో ఆర్థిక సంఘం చెప్పింది చెప్పినట్లు అమలైందని, మరి ఒక్క తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలని, ఆర్థిక సంఘం నివేదికను గత ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేశాయని అన్నారు హరీష్ రావు. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఆది తెలంగాణ పట్ల కుట్రపూరిత, పక్షపాత వైఖరి కాదా? తెలంగాణ ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర కాదా? డబ్బులు ఇవ్వకుండా, పనులు జరగుతలేవు అని చెప్పడం కుట్ర కాదా? అని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రూ.15 వేల కోట్ల ఎఫ్ఆర్బీఎంలు ఆపి, బోరుబావుల కాడ వి•టర్లు పెట్టలేదని రూ. 12 వేల కోట్లు, ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5,374 కోట్లు ఆపి, నీతి ఆయోగ్ చెప్పిన రూ. 24 వేల కోట్లు ఇవ్వకుండా, రాష్టాన్రికి డబ్బులు ఇవ్వకుండా ఆపి, ఇంకోవైపు రాష్ట్రంలోకి వొచ్చి అది అమలైతలేదు.. ఇది అమలైతలేదు అని చెప్పి జీతాలు లేటుగా వొస్తున్నాయని మాట్లాడటం వి• కుట్ర కాదా? దీనికి సమాధానం ఏంటి?..అంటూ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదని, ఈ రాష్ట్రానికి వి•రు చేసిన మేలు ఏంటో చెప్పాలని హరీష్ రావు నడ్డాను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్నే నిలుపుకోలేకపోయారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు.



