దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్‌ ‌కేసులు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌భారత్‌లో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,34,995 కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 268 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,46,77,647కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,43,665 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,552 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,698కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ ‌కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.08 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *