ఒకే రోజు 75 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్
భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటనకు డిమాండ్…విపక్షాల ఆందోళన
స్తంబించిన కార్యకలాపాలు…సెషన్ ముగిసే వరకు సభ్యుల సస్పెన్షన్
న్యూ దిల్లీ, డిసెంబర్ 18 : లోక్ సభలో గత వారం జరిగిన దాడి ఘటనపై, భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. భద్రతా వైఫల్యంపై వివరణనిస్తూ కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యుల నిరసనలతో ఉభయ సభలు దద్ధరిల్లుతున్నాయి. ఉభయ సభలను వారు స్తంబింప చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్క రోజే ఏకంగా 70 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిరది. వీరిలో 33 మంది లోక్ సభ సభ్యులు కాగా..45 మంది రాజ్య సభ సభ్యులున్నారు. లోక్ సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ సహా 33 మంది సభ్యులను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా సోవారం ప్రకటించారు. మరో ముగ్గురిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఇచ్చేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు ఎంపీలు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఫ్ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేయగా వీరిపై ప్రవిలేజెస్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇక స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశ పెట్టగా దానిని మోజవాణీ వోటుతో సభ ఆమోదించింది.
కాగా ఇప్పటికే 13 మంది లోక్ సభ సభ్యులు సస్పెన్షన్ వేటుకు గురైన విషయం తెలిసిందే దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 46 మంది లోక్ సభ సభ్యులను సస్పెండ్ చేసినట్లయింది. ఇక అటు రాజ్య సభలోనూ 45 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్య సభ చైర్మన్ సగదీప్ ధన్ఖడ్ సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపిలు జైరామ్ రమేష్, రణదీప్ సుర్జీవాలా, కెసివేణుగోపాల్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిరది. వీరిలో 34 మందిని ఈ సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేయగా మిగితా 11 మందిని ప్రపివిలేజ్ కమిటీ నివేదిక అందేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు చేర్మన్ ధన్కర్ వెల్లడిరచారు. కాగా ఈ సమావేశాలు ముగిసే వరకు రాజ్యసభ టిఎంసి సభ్బుడు డరెక్ ఒబేరాయ్ సస్పెండ్ అయి విషయం తెలిసిందే. దీంతో నేటి వరకు ఉభయ సభలతో కలిపి మొత్తం 92 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇక ఢద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో పలు మార్లు వాయిదా పడిన ఉభయ సభలు చివరకు నేడు మంగళవారానికి వాయిదా పడ్డాయి.




