దళారి చిత్ర దర్శకుడు గోపాల్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : పివిఆర్ మాల్ ఎర్రమంజిల్ సినిమా హాల్లో దళారి చిత్రం చూసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ దళారి చిత్ర దర్శకుడు కచిడి గోపాల్ రెడ్డిని ప్రశంసల వెల్లువలో ముంచెత్తాడు. విజయవంతమైన దళారి చిత్రంలో తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు దర్శకుడు గోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.  విభిన్నమైన కథాంశంతో దళారి వ్యవస్థపై రూపొందిన సినిమాలో కథ, స్క్రీన్ ప్లే డైలాగులతో సినిమాను దర్శకుడు నడిపించిన విధానం అమోఘంగా ఉందని అన్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయని అన్నారు. ప్రధాన పాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, షకలక శంకర్ అద్భుతమైన ప్రదర్శన చేశారన్నారు. సినిమా చాలా బాగుంది అని, అందరూ దళారి సినిమా చూసి ఆదరించాలని అన్నారు. అద్భుతమైన సినిమాలు రూపొందించినందుకు దళారి దర్శకులు కచిడి గోపాల్ రెడ్డి నిర్మాత వెంకట్ రెడ్డి, సంగీత దర్శకులు రాజ్ కుమార్, నటీనటులు టీమ్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *