దక్కన్‌ ‌స్పోర్టస్ ‌మాల్‌ ‌ప్రమాదంతో కదలిక

  • ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌
  • ఉన్నతస్థాయి సక్షలో మంత్రికెటిఆర్‌ ‌సూచన
  • మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం
  • అక్రమ నిర్మాణాలపై కమిటీ అధ్యయనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,జనవరి 25: నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మరోమారు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. బీఆర్‌కే భవన్‌లో హైదరాబాద్‌ ‌నగరంలో భవనాల్లో అగ్నిప్రమాదల ఘటనపై ఉన్నతస్థాయి సక్ష జరిగింది. మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌సీఎఎస్‌ ‌శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న భవనాలపై తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. ఫైర్‌ ‌సేప్టీ లేని భవనాల గుర్తింపు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, పాత భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, సెల్లార్లపై అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా డెక్కన్‌ ‌స్పోర్టస్ ‌మాల్‌లో గల్లంతైనమృతులకు కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే భవనాల విషయంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ భవనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచించనున్నది. అలాగే అగ్నిమాపకశాఖకు భారీగా నిధులు కేటాయించాలని, ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అగ్నిపకశాఖ ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలి నిర్ణయానికి వచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫైర్‌ ‌సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించాన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం చేపట్టే చర్యలో భవన యజమానులను భాగస్వాములను చేయాలని సూచించారు.్గ •ర్‌ ‌సేప్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రస్తుత ఫైర్‌ ‌సేప్టీ చట్టాలను మార్చాలన్నారు. ఫైర్‌ ‌సేప్టీ విషయంలో సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని, విదేశాల్లో ఫైర్‌  ‌సేప్టీపై అధ్యయనం చేయాలన్నారు. అవసరమైన ఆధునిక సామగ్రి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అత్యవసర సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *