ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డినీ ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం కల్వకుర్తి పర్యటనలో భాగంగా గవర్నర్ ను కలుసుకోవడం జరిగిందని తెలిపారు. బిజెపి నాయకులతో కలిసి ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ ఆయనను పూలమాలలు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మండల బిజెపి నాయకులు మంగళపల్లి రాంరెడ్డి, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
త్రిపుర గవర్నర్ ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాంపాల్





