తోమ్మిదవ విడత హరితహారంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటాలి : జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 22: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో హరితహారం, తోటల పెంపకం గూర్చి అన్ని మండలాల ఎంపిడిఓ, ఎంపిఓ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..మన జిల్లాలో ఈ సంవత్సరంకు గాను 2010 ఎకరాల పండ్ల తోటల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న రైతులు మాత్రమే ఈ తోటల పెంపకానికి అర్హులు మామిడి, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్, జామ, సపోటా ఇలా కొన్ని రకాల తోటల పెంపకానికి ఉద్యాన వన శాఖ అదికారులతో కలిపి రైతులను తోటల పెంపకానికి ప్రోత్సహించి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 2014వ సంవత్సరం నుండి ఇప్పటివరకు జిల్లాలో హరితహారం లో డ్రైగా ఉన్న ప్రాంతాల నుండి పచ్చదనం గల ప్రాంతాలుగా తయారీ చెసుకున్నాం. కేంద్ర నీతి అయోగ్ జలశక్తి అభియాన్ ఆకస్మిక తనిఖీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ తొమ్మిదవ విడత హరితహారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సుమారుగా 21లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటివరకు 7.82 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. మొన్నటి వరకు వర్షాలు లేక హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం సరిగ్గా జరగలేదు ఇప్పుడు విస్తారంగా కురుస్తున్నాయి. మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. మండలాలవారిగా ఇచ్చిన లక్ష్యం అనుగుణంగా నాటిన మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీ గ్రామ సెక్రటరీ లకు గ్రీన్ ఆక్షన్ ప్లాన్ ను చూపించాలి. హరితహారం ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్, ఆర్ అండ్ బి, పి ఆర్ రోడ్స్, ఇరిగేషన్ కెనాల్ ఇలా అనేక ప్రాంతాలను మొక్కలు నాటవచ్చు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రెస్పాన్సిబులిటీ అధికారి మండలాల్లో ఎంపిడివోలు, మున్సిపాలిటీలో కమిషనర్లు మాత్రమే. ఈజీఎస్ లో ఎక్కువ మొత్తంలో కూలీలను సమకూర్చుకొని గ్రామాల్లో మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నాటడమే కాకుండా మొక్కల సంరక్షణ కూడా అత్యంత ముఖ్యమైనది. స్థానిక ఆటవి శాఖ నర్సరీ నుండి మొక్కలను దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఎంపీడీవోలు హరితహారం ఇచ్చిన టార్గెట్ మొక్కలకు తప్పనిసరిగా ఎస్టిమేట్ ను తయారు చేయాలి. ఇందుకోసం 10% గ్రీనరీ బడ్జెట్ను వాడుకోవాలన్నారు. పాఠశాలలో, కళాశాలలో కాంపౌండ్ వాల్ చుట్టూ రెండు వరుసగా మొక్కలు పెట్టాలి. పాఠశాలలో మొక్కలు నాటే ప్రక్రియలో పిల్లల ను భాగస్వాములను చేయాలి. గ్రామాల్లో మున్సిపాలిటీలో ఉన్న గవర్నమెంట్ భవనాలు, ఫ్యాక్టరీలు, రైస్ మిల్లుల వద్ద మొక్కలు నాటాలి. ప్రతి ఇంటికి 6 మొక్కలు అందించాలి. అగ్రికల్చర్ ప్రాంతాల్లో నాటే మొక్కలను పర్యవేక్షణ చేయాలని డీఏఓ, పాఠశాల లో హరితహారం ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని డిఈఓ, కొన్ని మండలాల్లో నాటే ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ, డిఆర్డిఏ అధికారులకు తెలిపారు. ఈ పది రోజుల్లో హరితహారంలో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు 2023 భాగంగా సెంట్రల్ టీం పర్యవేక్షణకు ఎప్పుడైనా వస్తారు పబ్లిక్ టాయిలెట్స్, ఇంకుడు గుంత, పారిశుద్ధ్యం ఇలా అన్నిటికి సిద్ధం కావాలన్నారు.
ఈ సమావేశంలో గజ్వేల్ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, డిఆర్డిఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీనివాస్, జెడ్పి సీఈవో రమేష్, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, డిఏఓ శివప్రసాద్, డిహెచ్ఓ సునీత, డిపిఓ దేవికి దేవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *