శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ, మియాపూర్ నుండి స్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ, కాపు సంక్షేమ సంఘం భవనం నిర్మాణం కొరకై 5 ఎకరాల స్థలం కేటాయింపు, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం ,ఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేసిన శుభసందర్భంగా ఈ రోజు అసెంబ్లీ లోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు , కె.పి వివేకానంద గౌడ్ , బేతి సుభాష్ రెడ్డి ల తో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ ట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసున్న నేత అని,కర్షక, కార్మిక పక్షపాతి అని , రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలంతా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందనీ, రైతు బాంధవుడుగా మరోసారి నిలిచారని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు 13 కిలోమీటర్ల మేర 3,250 కోట్ల రూపాయల తో మెట్రో విస్తరణచేపట్టడం శుభపరిణామం అని, మియాపూర్ నుండి లక్ది కపుల్ వరకు విస్తరణ చేపట్టడం గొప్ప విషయం అని , ,కాపు సంక్షేమ సంఘం భవనం నిర్మాణం కొరకై 5 ఎకరాల స్థలం కేటాయింపు, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం తీసుకోవడం ఆయన పరిపాలన దక్షతను తెలియజేస్తుందని అని ఉన్నారు. ఎవరు ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు,43వేల 373 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు కార్మికులు రుణపడి ఉంటారుఅని,ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ, 43 వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.


