మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ భవిష్యత్తు సీఎం కేసిఆర్ తోనే సాధ్యమౌతుందని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖాల్ గ్రామానికి చెందిన బి జె పి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ ఎస్ పార్టీలో చేరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసిఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అన్నారు. పార్టీలో చేరుతున్న వారికి సముచితమైన గౌరవం కల్పిస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.




