పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి ఓటు అడగాలని బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన.. నియోజకవర్గ సాయి విద్యార్థి, యువత, సోషల్ మీడియా ముఖ్య నాయకుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు జగన్మోహన్ రావు, గెళ్లు శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత విద్యార్థి సోషల్ మీడియా విభాగాల ముఖ్య నాయకులు కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు చేపట్టే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివిధ రూపాల్లో ప్రజలకు చేరవేయాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, మూడోసారి విజయం అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కార్పొరేషన్ చైర్మన్లు జగన్మోహన్ రావు, గెళ్లు శ్రీనివాస్ యాదవ్ లు.. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తూ ఉందని తెలిపారు. ప్రజలు ఇప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకునేందుకు వార్త పత్రికలతో పాటు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందించాలని కోరారు. ప్రతి ఓటరును కలిసి టిఆర్ఎస్ పార్టీ అవశ్యకతను వివరించాలని కోరారు. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న దుర్బుద్ధితో ప్రతిస్పక్ష పార్టీలు అసత్య ప్రచారాలను చేపట్టే ప్రమాదం ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.50 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సఫనదేవ్, శంకర్ యాదవ్, వివిధ విభాగాల ప్రతినిధులు మెరాజ్ ఖాన్, గూడెం సంతోష్ రెడ్డి, చెన్నారెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, కృష్ణ కాంత్, సందీప్, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల పార్టీ బిఆర్ఎస్





