తెలంగాణ ఎంసెట్‌, ‌పీజీసెట్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

  • మే 7 నుంచి ఎంసెట్‌ ‌పరీక్షల నిర్వహణ
  • 28న నోటిఫికేషన్‌ ‌విడుదల….ఏప్రిల్‌ 30‌న హాల్‌ ‌టికెట్లు డౌన్‌లోడ్‌
  • ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసిన ప్రొఫెసర్‌ ‌లింబాద్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : తెలంగాణ ఎంసెట్‌, ‌పీజీ సెట్‌ ‌షెడ్యూల్‌  ‌విడుదల చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  మే 7 నుంచి ఎంసెట్‌ ‌పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌ ‌విడుదల కానుంది. మార్చి 3 నుండి ఏప్రిల్‌ 4  ఆన్‌ ‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జరిమానతో మే 2 వరకు దరఖాస్తులను తీసుకోనున్నారు. ఏప్రిల్‌ 30‌న హాల్‌ ‌టికెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకోవచ్చు. మే 7 నుండి 11 వరకు ఎంసెట్‌ ‌పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 29 నుంచి జూన్‌ 1 ‌వరకు పీజీసెట్‌ ఈ ‌పరీక్షలను జరగనున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 ‌వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. లేట్‌ ‌ఫీతో మే 24 వరకు అప్లికేషన్స్ ‌తీసుకోనున్నారు. మే 21వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో హాల్‌ ‌టికెట్స్ ‌డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, అ‌గ్రకల్చర్‌, ‌ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్‌  ‌నోటిఫికేషన్‌ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌ ‌దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.

ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 ‌వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ‌ఫ్రొఫెసర్‌ ‌లింబాద్రి ఎంసెట్‌ ‌షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ‌నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్‌, ‌మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్‌, ‌ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 250 ఫైన్‌తో- ఏప్రిల్‌ 15 ‌వరకు స్వీకరిస్తారు. రూ.1000 అపరాద రుసుముతో- ఏప్రిల్‌ 20 ‌వరకు, రూ.2500 ఫైన్‌తో- ఏప్రిల్‌ 25 ‌వరకు,రూ.5000 అపరాధ రుసుముతో- మే 2 వరకు. దరఖాస్తులను స్వీకరిస్తారు.  ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *