- హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
- రాష్ట్రంలో పలుజిల్లాలో ఎడతెరపి లేని వర్షం…హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ.
ఇక ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.రాష్ట్రంలో పలుజిల్లాలో ఎడతెరపి లేని వర్షం…హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. మంగళవారం కూడా ఇంకా కురుస్తూనే ఉన్నది.
దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే నిన్న, మొన్నటి వరకు వానల కోసం ఎదురుచూసిన రైతులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ నగరం ముసురేసింది. పలుచోట్ల జల్లులు కురిసాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 6 సెంటీవి•టర్ల వర్షపాతం నమోదయింది. దుగ్గొండిలో 5.02, వరంగల్‌లో 4.6, నర్సంపేటలో 3.6, ఖిలా వరంగల్‌లో 3.4, గీసుకొండలో 3.2, ఖానాపూర్, చెన్నారావుపేటలో 2.3 సెంటీవి•టర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదయింది. అత్యధికంగా భువనగిరి, రామన్నపేట మండలాల్లో 1.7 సెంటీవి•టర్లు, నారాయణపూర్‌లో 1.4, అడ్డగూడూరులో 1.3, మోటకొండూరు, రాజాపేట మండలాల్లో 1.2 సెం.వి•.చొప్పున వర్షపాతం నమోదయింది. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌లో 9.2 సెం.వి•., ములుగులో 6.5, గోవిందరావుపేటలో 8.7, తాడ్వాయ్‌లో 9.2, ఏటూరునాగారంలో 7.9, కన్నాయిగూడెంలో 9.8, వాజీడులో 8.2, వెంకటాపురంలో 8.5, మంగపేటలో 8.0 సెంటీవి•టర్ల వర్షం కురిసింది.
ఇక వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఓ మోస్తారుగా వర్షం కురుస్తున్నది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా రాత్రి నుంచి విడవకుండా వాన పడుతున్నది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 5.6 మిల్లీవి•టర్ల వర్షపాతం నమోదయింది. హైదరాబాద్ వ్యాప్తంగా వేకువజాము నుంచి వర్షం కురుస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తున్నది. ఉట్నూరు, ఉంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో వాన పడుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతుంది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ డివిజన్లో అత్యధికంగా నార్సింగిలో 2.6 సెంటీవి•టర్లు, చేగుంటలో 2 సెం.వి•టర్ల వర్షం కురిసింది. నర్సాపూర్ డివిజన్లో కుల్చారంలో 2.2 సెం.వి•., కౌడిపల్లిలో 1.72 సెం.వి•., మెదక్ డివిజన్లో హవేళీఘన్‌పూర్‌లో 3.3 సెం.వి•, రామాయంపేట 3.1, సెం.వి•, మెదక్ 3.06 సెం.వి•, నిజామ్‌పేటలో 2.8 సెంటీవి•టర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.



