తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల,అక్టోబర్‌3: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగాయి.సాయంత్రం చందప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సుప్రీం ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ‌యూయూ లలిత్‌ ‌కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *