తిరుమలకు పెరుగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 20 : ‌తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొండపై ఉన్న 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చిందని వివరించారు.

ఇదిలావుంటే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా దాసరి కిరణ్‌ ‌కుమార్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నూతన సభ్యుడికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *