స్వార్థం కోసం వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూరులో స్థానం లేదు.
తాండూర్ లో టిఆర్ఎస్ గెలుపు ఖాయం.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి.
తాండూరులో గెలిచేది నేనే… నిల్చేది నేనే.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలని స్వార్థం కోసం వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూర్లో స్థానం లేదని అన్నారు, తాండూర్లో గెలిచేది నేనే నిలిచే నేనేనని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి రెండవ దఫా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ 70 నుంచి 80 స్థానాలను సాధించి అధికారం చేపడుతుందని అన్నారు. తాండూర్ లో రోహిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ, 1600 కోట్ల రూపాయల నిధులతో తాండూర్ ను అభివృద్ధి చేశామని తాను చేసిన అభివృద్ధే తన గెలుపుకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. తాండూర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా చేశారు. ఈ ర్యాలీలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి తరలివచ్చిన జనసంద్రంతో తాండూరు పట్టణం మయమంతా గులాబీమయం అయింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఇంద్రాచౌక్లో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఇంటోనికి బయటోకి మధ్య ఎన్నికలు అని అన్నారు. దొంగలందరూ ఏకమై తాండూరు పై కుట్రపన్నాతూ విచ్చిన్నకర శక్తులన్నీ ఒకటి అవుతున్నాయని అన్నారు.స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూరులో స్థానం లేదని, డబ్బు సంచులతో తాండూరు ప్రజల ఆత్మాభిమాన్నాని కొనలేరని అన్నారు . పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి తాండూరు పై సాగుతున్న కుట్ర ను వివరించాలి అన్నారు. తాండూరు భవిష్యత్తు కొరకు, ప్రజల బాగు కొరకు కారు గుర్తుకు ఓటు వేయాలి కోరారు. ఇది నామినేషన్ ర్యాలీ గా కనిపించడం లేదు విజయోత్సవ ర్యాలీ గా కనపడుతుందని అన్నారు. తాండూరులో గెలిచేది నేనే నిల్చేది నేనే. అని అన్నారు టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గత 40 సంవత్సరాలలో ఎవరు చేయని అభివృద్ధి 1680 కోట్ల రూపాయలు తీసుకువచ్చి తాండూర్ ను అభివృద్ధి అర్చనట్లు తెలిపారు తాండూరు ప్రజల ఆశీర్వాదంతో మరోమారుగా ఎమ్మెల్యేగా గెలిచి తాండూరు అభివృద్ధికి ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలోనే కృషి చేస్తామని అన్నారు తాండూర్ అభివృద్ధి కేవలం టిఆర్ఎస్ పార్టీ తనతోనే సాధ్యమని అన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా తాండూరు ప్రజలు తనకే పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





