డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేశాం

  • పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌దే
  • ఉద్యమ పునాదికి న్యాయం జరుగుతుంది
  • పోడు భూముల హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రులు కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌
  • ఆకస్మికంగా మరణించిన కారోబార్‌ ‌కుటుంబానికి మంత్రి కెటిఆర్‌ ‌భరోసా…వ్యవసాయ కళాశాలలో భార్యకు ఉద్యోగం

సిరిసిల్ల , ప్రజాతంత్ర, జూలై  6 :  70 ఎండ్లలో భారతదేశ చరిత్రలో  ఏ ప్రభుత్వము చేయనంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కే తారక రామారావు అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌ ‌హాల్‌లో సంవత్సరాల తరబడి పోడు భూములను సాగు చేసుకుంటున్న 1614 మంది గిరిజనులకు లబ్ధిదారులకు 2558 ఎకరాలకు హక్కు పత్రాల ను అందించారు. ఈ సందర్భంగా మంత్రి  కెటిఆర్‌ ‌మాట్లాడుతూ…స్వరాష్ట్రం తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు..అటవీ హక్కు పత్రాలను అందించి జల్‌.. ‌జంగల్‌..‌జమీన్‌…అనే కుమ్రం భీం కలలను కూడ సీఎం కేసిఆర్‌ ‌నిజం చేశారన్నారు.‘‘మావ నాటే మావే రాజ్‌’’ ‌మా తండాల్లో మా రాజ్యం! నినాదంను తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల దశాబ్దాల కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌దే నన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల ప్రాతిపదికనే స్వరాష్ట్రం ఉద్యమం సాగిందని అన్నారు.

ఉద్యమ పునాదులు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. గిరిజన గూడాలు, తండాలను గ్రామపంచాయితీలుగా చేసి 3 వేల గిరిజన సర్పంచ్‌లు, 30 వేల గిరిజన వార్డ్ ‌మెంబర్‌లుగా చేసిన ఘనత సీఎం కేసిఆర్‌ ‌దేనన్నారు. తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే కాదు వాటి సమగ్రాభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీల చిరకాల కోరిక ‘పోడు భూముల పట్టాల పంపిణీ’కి తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌నెరవేర్చారన్నారు.తెలంగాణ లో 1 లక్షా 51 వేల మంది ఏకకాలంలో 4  లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందించామని,దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించలేదన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు 1614 మంది గిరిజనులకు 2858 ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందిస్తున్నామని,భవిష్యత్తులో భూ హద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు కల్పించామన్నారు.

తెలంగాణలో గిరిజనుల గడప గడపకు సంక్షేమం ఫలాలు అందేలా చూస్తున్నామని,బంజారహిల్స్ ‌లో ధనికులు ఎలాంటి నీరు త్రాగుతున్నారో నేడు  గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు కూడా అవే నీరు త్రాగుతున్నారని అన్నారు.73 వేల కోట్ల రూపాయలు 60 లక్షల పై చీలుకు రైతుల ఖాతాల్లో రైతు బంధు పెట్టుబడి సహాయంగా జమ చేశామన్నారు.2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యమ పునాదికి న్యాయం ,గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు.వందల గురుకులాలు ఏర్పాటు చేసి, వేలాది మంది విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.ఆదివాసీలు,గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ  ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.తెలంగాణకు హరితాహరం కార్యక్రమం ద్వారా 5 లక్షల 13 వేల ఎకరాల్లో కొత్తగా అడవిని సృష్టించామని గుర్తు చేశారు.గుంట భూమి ఉన్న రైతుకు రైతు భీమా అమలు చేస్తున్నామని,ఎస్టీలకు 6శాతం రిజ్వేషన్‌ ‌ను 10 శాతం కు పెంచామన్నారు.ఫలితంగా ముఖ్యమంత్రి  కేసిఆర్‌ ‌గిరిజనుల గుండెచప్పుడు,ఆదివాసీల ఆత్మబంధువు అయ్యారన్నారు.

మంత్రి  కొప్పుల ఈశ్వర్‌ ‌మాట్లాడుతూ అటవీ భూములను పట్టాలు అందించడం సాహసోపేతమైన నిర్ణయం అన్నారు.సీఎం కేసిఆర్‌ ‌ధృడమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు.గిరిజన గూడాలు, తండాలను జీపీ  లు చేయడం వల్ల అవి అభివృద్ది బాట పట్టాయన్నారు.గురుకులాల ద్వారా గిరిజన బిడ్డలకు నాణ్యమైన విద్య ను ప్రభుత్వం అందిస్తుందనన్నారు.స్వరాష్ట్రం తెలంగాణలో ఆదివాసీలు ,గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ  ప్రభుత్వం దేశం లో ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.సీఎం కేసిఆర్‌ ‌నాయకత్వాన్ని సందర్భం వచ్చినప్పుడు వెంట ఉండాలి. అండగా నిలవాలన్నారు.పట్టుదల, క్రమశిక్షణ తో సీఎం కేసిఆర్‌ ‌తెలంగాణ ను దేశానికే మోడల్‌ ‌గా తీర్చిదిద్దారన్నారు.

వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌ ‌మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌దేనని,రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమం దేశంలొ ఎక్కడా జరగడం లేదన్నారు.పట్టాలతో పాటు రైతు బంధు పథకం పెట్టుబడి ఆర్థిక సహాయం కూడా ఈ వానాకాలం నుండే ప్రభుత్వం అందజేస్తుందని,సీఎం గొప్పతనానికి ఇది నిదర్శనమనని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ అరుణ, రాష్ట్ర టెక్స్టైల్‌,‌పవర్లూం చైర్మెన్‌ ‌ప్రవీణ్‌ ,‌సెస్‌ ‌చైర్మెన్‌ ‌రామారావు,గ్రంధాలయ శాఖ చైర్మెన్‌ ‌శంకరయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సయ్య,సిరిసిల్ల,వేములవాడ మున్సిపల్‌ ‌చైర్మన్లు కళ,మాధవి,జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంతి,జిల్లా అదనపు కలెక్టర్‌ ‌లు బి సత్య ప్రసాద్‌, ఎన్‌ ‌ఖీమ్యా నాయక్‌,  ఆర్డీవో లు టి శ్రీనివాస్‌ ‌రావు,పవన్‌ ‌కుమార్‌, ‌జెడ్పి  సీఈఓ గౌతమ్‌ ‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు , అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

కారోబార్‌ ‌కుటుంబానికి మంత్రి కెటిఆర్‌ ‌భరోసా…వ్యవసాయకళాశాలలో భార్యకు ఉద్యోగం
చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్‌ ‌ప్రభాకర్‌ (35) ‌కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అం‌డగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హావి•నిచ్చారు. గురువారం జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్‌ను ప్రభాకర్‌ ‌భార్య జ్యోతి, పిల్లలు కలిశారు. తమను ఆదుకోవాలని మంత్రిని వేడుకున్నారు. ప్రభాకర్‌ ‌మృతి బాధాకరమని, అనివార్య కారణాలతో పరామర్శకు రాలేకపోయానని జ్యోతికి వివరించారు. ఇదే వ్యవసాయ కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని హావి ఇచ్చారు.

అక్కడే ఉన్న వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ పీఎస్‌ శ్రీ‌నివాస్‌కు ఉద్యోగ భర్తీ పక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లోనే ఉద్యోగ నియామకానికి సంబంధించిన ఉత్వర్వులు వొస్తాయని, ఇక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవాలని మంత్రి సూచించారు. కొడుకుల చదువులకు సహాయం చేస్తానని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ ఉద్యోగంతో పాటు పిల్లల చదువులకు అండగా ఉంటానని తెలుపడంతో  జ్యోతితో పాటు సర్పంచ్‌ ‌మాట్ల మధు, స్థానిక నేతలు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *