డెంటల్‌ ‌విద్యార్థినిని హతమార్చిన ప్రేమోన్మాది

గుంటూరు, డిసెంబర్‌ 6 :  ‌ప్రేమోన్మాదిగా మారిన ఐటి ఉద్యోగి డెంటల్‌ ‌విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి తిరస్కరించడంతో దారుణంగా హమార్చాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌ ‌మణికొండ ప్రాంతంలో ఐటి రంగంలో పనిచేస్తోన్న జ్ఞానేశ్వర్‌ ‌విజయవాడలోని గన్నవరం పిన్నమనేని డెంటల్‌ ‌కళాశాలలో చదువుతున్న తపస్వినిని ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు.

ఆమె విజయవాడ పోలీసు లకు ఇటీవల ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలి గదికి ఆమె సోమవారం వెళ్లినట్లు తెలుసుకుని, అక్కడికి వెళ్లి సర్జికల్‌ ‌బ్లేడ్‌తో దాడి చేశారు. స్థానికులు వచ్చి జ్ఞానేశ్వర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో తపస్విని మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *