డిహెచ్‌ శ్రీ‌నివాసరావు అవినీతిని బయటపెడతాం

  • ఎమ్మెల్యే టిక్కెట్‌ ‌కోసం ఆయన నాటకాలు
  • రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌

‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ‌కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్‌ ‌రావు అవినీతిని రుజువు చేసి చూపిస్తామని చెప్పారు. తెలంగాణ స్టేట్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు పెద్ద అవినీతి పరుడు అని విమర్శించారు. ‘ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడారట. మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో ఎందుకు ఇక్కడ బతకడం’ అని వ్యాఖ్యానించారు. ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా అని ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్‌లో కూడా  శ్రీనివాస్‌ ‌రావు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆరోపించారు. సెస్‌ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను చెప్పుదెబ్బలకు సిద్ధమేనని.. డీహెచ్‌ శ్రీ‌నివాస రావును రోడ్లపై ఉరికించి ఉరికించి కొట్టినా తప్పులేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఒక రేంజ్‌లో దుమారం రేపుతున్నాయి. యేసు క్రీస్తు కృప వల్లే కొరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.. డీహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీహెచ్‌ శ్రీ‌నివాస్‌ ఓ అవినీతిపరుడని బండి సంజయ్‌ ఆరోపించారు. ఒక మతానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఓ మతానికి చెందిన దేవుడే కాపాడతాడంటూ చెప్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే టికెట్‌ ‌కోసమే డీహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. డీహెచ్‌ అవినీతిని త్వరలోనే నిరూపిస్తామని బండి సంజయ్‌ ‌తెలిపారు.

ప్రభుత్వ అధికారిగా ఉన్న డీహెచ్‌ శ్రీ‌నివాస్‌..‌క్రైస్తవం వల్లే కొరోనా తగ్గిందని, క్రైస్తవం వల్లే భారత్‌ అభివృద్ధి చెందిందని మాట్లాడటం దారుణమన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన డీహెచ్‌ను రోడ్లపై ఉరికించి ఉరికించి కొట్టినా తప్పులేదంటూ.. బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితపై కూడా సంజయ్‌ ‌తీవ్ర విమర్శలు చేశారు. తమ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హావి•ని సీఎం కేసీఆర్‌ ‌నెరవేర్చలేదని.. ఒకవేళ నెరవేర్చినట్టు నిరూపిస్తే తాను చెప్పు దెబ్బలకు సిద్ధమని బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *