డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం

నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటుకు అంగీకారం
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : నిర్మలా సీతారామన్‌ ‌తన బడ్జెట్‌లో డిజిటల్‌ ‌విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

భౌగోళిక, భాషాపరమైన, కళలపరంగా, అన్ని స్థాయుల్లో పుస్తకాలను ఇది అందుబాటులోకి ఉంచుతుంది. ’యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్‌ ‌లైబ్రరీలు ఏర్పాటుకు రాష్టాల్రకు ప్రోత్సాహం అందిస్తాం. నేషనల్‌ ‌డిజిటల్‌ ‌లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావాల్సిన మౌలిక వసతులకు తోడ్పాటు అందిస్తాం’ అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *