ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : జాతీయ ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని గత 33 సం.లుగా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో అపార సేవలు అందిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్, ఉపాధ్యాయులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుప్పాల అనిల్ కుమార్ కు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్, రిజిస్టర్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ డాక్టర్ అనిల్ కుమార్ కు భారత రత్న డాక్టర్ ఎం.విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు 2023ని తెలంగాణ మేధాల ఫోరం రాష్ట్ర శాఖ(టీసీసీ) ఆధ్వర్యంలో శాలువా, పూలమాల జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్, కార్యదర్శి డాక్టర్ మహ్మద్ అక్బర్ అలీ, ప్రముఖ విద్యావేత్త జక్కుల విజ్ఞత,ఎస్.రామకృష్ణ శాస్త్రి కాశముని శ్యామ్ రావు ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు డాక్టర్ పుప్పాలఅనిల్ కుమార్ కు ఘనంగా సన్మానించారు.




