జీ 20 సదస్సులో పాల్గొన్న చైతన్య

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 19: న్యూ యార్క్ కేంద్రంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జీ 20 సదస్సులో వికారాబాద్ ప్రాంతంకు చెందిన చైతన్య పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి జీ-20 సదస్సులో పాల్గొన్న మొదటి యువకుడు చైతన్య కావడం విశేషం జి ట్వంటీ సదస్సులో వ్యాపారంగంపై ప్రసంగించిన చైతన్యను వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు. న్యూయార్క్ లో గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడంతోపాటు ఆయన అక్కడ గల సంస్కృతి సాంప్రదాయాలు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ g20 సదస్సులో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అని ప్రస్తుతం వ్యాపారంగంలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని అందులో భాగంగా యువత నిర్వీర్యం కాకుండా కృషి పట్టుదలతో ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, తాను కలలో కూడా న్యూయార్క్ సదస్సులో పాల్గొంటానని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *