ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామలలో, పట్టణాలలో మట్టిలో మాణిక్యాల్లాగా దాగి వున్న సమాజ సేవకుల, ఉపాధ్యాయుల, వైద్యుల, కళాకారుల, కవుల, రచయితల, క్రీడాకారుల, విద్యావంతుల, కార్మికుల, కర్షకుల సేవలను, ప్రతిభను గుర్తించి వారికి ‘సేవా భారతి’ జాతీయ పురస్కారాన్ని ‘తెలుగు తేజం’ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించి వారి సేవలను, ప్రతిభను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యంతో సేవా దృక్పదంతో ప్రముఖ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ‘ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమి’ హైదరాబాద్ ఆధ్వర్యంలో 13 ఆగస్ట్ హైదరాబాద్లో ‘పురస్కారాల’ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమి వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ ఇఎస్ఎస్ నారాయణ మాస్టర్ మంగళవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఇందుకు గాను సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల, వికాలంగుల, విద్యా, వైద్యం, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నాటకరంగం, టివి, సినీ రంగాలలో సేవలందిస్తున్నవారు, ప్రతిభవంతులు పురస్కారాల ఎంపిక కొరకు వారి సేవలను, ప్రతిభను, గురించి తెలియచేసే సర్టిఫికెట్స్, ఫోటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో పాటు 4 పాస్ పోర్టు సైజు ఫోటోలను ధరఖాస్తుకు జతచేసి ఈ నెల 8 లోపు తమ ఆఫీసు అడ్రస్ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమి, డోర్ నెం.1-20-164, గోకుల్ నగర్, వెంకటాపురం, తిరుమలగిరి, సికింద్రాబాద్-15 నకు పంపించాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు ఫోన్ : 9652347207 నెంబర్ లో సంప్రదించాలని కోరారు




