జల దిగ్బంధంలో  వరంగల్‌ ‌నగరం….

వరంగల్‌ ‌నగరం గతంలో లేనంత జలదిగ్భందానికి గురైంది. వరంగల్‌, ‌హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని దాదాపు 30 కాలనీలకు పైగా నీ• మునిగాయి.. పలు కాలనీల్లోని ప్రజలు కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. పలు ఇండ్లలో నీరు చేరుకోవడంతో వాటిని కాజీపేట రైల్‌ ‌స్టేషన్‌ ‌నీటిలో తేలాడటం ఈసారి వింత్లైన విషయం. రైలు పట్టాలనుండి ప్లాట్‌ ‌ఫాం మీద దాదాపు రెండు పీట్లవరకు నీరు నిలిచి ఉందంటే ఎంత వర్షం పడిందన్నది అర్థమవుతోంది. దీంతో పలు రైళ్ళను నిలిపేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారిని అక్కడ దించేయడంతో ఎటూ వెళ్ళేందుకు సౌకర్యంలేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం తమకు మంచినీళ్ళు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. నగరం విషయానికొస్తే ఏ కాలనీ చూసినా నీటి మయమే. హంటర్‌రోడ్డు, సాయినగర్‌, ఎన్టీఆర్‌ ‌నగర్‌, ‌బృందావన్‌రకాలనీ, సంతోషిమాత కాలనీ, డికె కాలనీ , బిఆర్‌ ‌నగర్‌, ఆర్టీఏ కాలని, బట్టల బజార్‌, ‌పాపయ్యపేట చమన్‌, ‌పాతబీటు బజార్‌, ‌రామన్నపేట ముఖ్యంగా సమ్మయ్యనగర్‌ ‌లాంటి అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. ఈ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచి పోయాయి. ఇక్కడి ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. వరంగల్‌ ‌తూర్పు నియోజకవర్గం పరిధిలోని కాశికుంట, ఎస్‌ఆర్‌ఆర్‌ ‌తోట, శాతరాసి కుంట, గాందీనగర్‌ , ‌గిరిప్రసాద్‌ ‌నగర్‌, ‌కాశిబుగ్గ, ఎల్‌బి నగర్‌ ‌తదిర లోతట్టు ప్రాంతాల పరిస్థితి చాలా బీబత్సంగా మారింది. గోపాపూర్‌ ‌చెరువు ఆదృతంగా మారటంతో అక్కడ సమీపంలో ఉన్న మధురానగర్‌, ‌వివేకానంద కాలనీ , సాయి గణేష్‌నగర్‌, ‌శాంతినగర్‌ ‌ప్రాంతాలు వరద ముంపుకు గురైనాయి. నగర ప్రధాన రహదారులపైన కూడా నాలాలు పొంగిపొర్లాయి. భగత్‌సింగ్‌ ‌కాలనీలో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. హనుమకొండ నుండి వరంగల్‌ ‌వెళ్ళే ప్రధాన రహదారిలో అలంకార్‌ ‌టాకీసు వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమీపంలోని భద్రకాళీ చెరువు మత్తడి పడడం, ములుగు రోడ్డు నుండి దిగువకు నీరు రావడంతో అ ప్రాంతమంతా జలమయమైంది.

అధికారుల ఎవరినీ అటు వైపు వెళ్ళ కుండా బారికేడ్స్ ‌పెట్టారు. పలితంగా కాకతీయ ఫెస్‌ ఒన్‌, ‌ఫేస్‌ 2 ‌కాలనీలు నీటిమయమైనాయి. అలాగే హనుమకొండనుండి కాజీపేట మార్గంలో జిల్లా కలెక్టరేట్‌ ‌దాటిన తర్వాత కూడా రాకపోకలకలు నిలిచిపోయాయి. కార్లు మునిగేంత నీటిప్రవాహం ఉండడంతో గురువారం సాయంత్రవరకు అటువైపు ఎవరూ వెళ్ళలేని పరిస్థితి. వడ్డెపల్లి చెరువు పొంగి పొర్లుతుండడంతో పింగిలి మహిళా కళాశాల, వడ్డెపల్లి చర్చి, ఆర్టీసి కాలనీ, పరిమిళ, రాంనగర్‌ ‌కాలనీలు నీటి మయంగా మారాయి. హంటర్‌రోడ్‌లో విపరీతంగా వాన నీరు చేరుకోవడంతో జనజీవన స్థంబించి పోయింది. ఇక్కడ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన దాదాపు మూడు వందల మంది విద్యార్థులు బుధవారం నుండి అన్నం నీళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి. గురు వారం సాయంత్రం వారిని గర్తించి బోటు సహాయంతో బయటికి తీసుకువస్తున్న పరిస్థితి. ఇటు హనుమకొండ – కరీంనగర్‌ ‌రాకపోకలు కూడా నిలిచి పోయాయి. నయింనగర్‌ ‌బ్రిడ్జి ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాకతీయ యూనివర్శిటీ ప్రాంతమంతా నీటి మయంగా మారింది. ఇటు వారు అటు, అటు వారు ఇటు వెళ్ళలేని పరిస్థితి. భద్రకాళీ ఆలయం, అయ్యప్పస్వామిగుడిలోకి వరద హోరెత్తింది. సమీపంలోని కాపువాడ వరదమయమైంది. అమృతా టాకీస్‌ ‌వద్ద విద్యుత్‌ ‌వైర్లు తెగిపోవడంతో ఒక వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్‌- ‌ఖమ్మం జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని వద్ద ఊరచెరువు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. ఉదయంనుండి చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. నగరంలోని పలు అపార్టు మెంట్‌ల్లో, షాపింగ్‌ ‌కాంప్లెక్స్‌ల్లోని సెల్లార్‌లలో నీరునిండడంతో జనం భయపడిపోతున్నారు. తాగునీరు లభించక రోజంతా మినర్‌ ‌వాటర్‌లకోసం జనం ఎగబడ్డారు.
——

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *